- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ambani's fashion : వజ్రాల అంగిలో అనంత్ అంబానీ, లగ్జరీ నగల్లో రాధికా మర్చంట్..! వైరలవుతోన్న వీడియో
దిశ, ఫీచర్స్ : ప్రముఖ వ్యాపార దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ, ఆయన కుటుంబానికి సంబంధించిన ఏ విషయమైనా నెట్టింట ఆసక్తికర చర్చకు దారితీస్తుంది. ఆ మధ్య అనంత్ అంబానీ పెళ్లికి సబంధించిన పలు వార్తలు సోషల్ మీడియా ట్రెండింగ్‌లో దూసుకుపోయాయి. ఆ తర్వాత కూడా పలు విషయాల్లో ఇది కంటిన్యూ అవుతోంది. ముఖ్యంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులు, వారి కుటుంబం కలిసి పాల్గొన్న కార్యక్రామాలు, వేడుకులకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ అవుతున్నాయి. అలాంటి వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చర్కర్లు కొడుతోంది.
వైరల్ సమాచారం ప్రకారం.. అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ దంపతులతోపాటు నీతా అంబానీ కూడా రీసెంట్‌గా గణేష్ చతుర్థి వేడుకలో పాల్గొన్నారు. కాగా ఈ సందర్భంగా వారు ధరించిన దుస్తులు, నగలు, ముఖ్యంగా డైమండ్ యాక్సెసరీస్, ఎథ్నిక్ లుక్స్ నెటిజన్లను తెగ ఆకట్టుకుంటున్నాయి. అనంత్ అంబానీ కుర్తా పైజామాలో కనిపించగా.. అతను వేసుసుకున్న జాకెట్‌పై డైమండ్ బటన్స్ ఉండటం, పైగా గణపతి బ్రూచ్ పెట్టుకోవడం ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకుంటోంది. ఇక నీతా అంబానీ ధరించిన చెవి పోగులు, చేతి ఉంగరాలు, వజ్రపు హెయిర్ పిన్, మల్టీ స్ట్రింగ్ ముత్యాల హారం, రాధికా మర్చంట్ ధరించిన చోకర్ నెక్లెస్, మ్యాచింగ్ జుంకాలు, సింగిల్ లైన్ మంగళసూత్రం, డైమండ్స్ పొదిగిన గాజులు నెటిజన్లను తెగ ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుండగా.. అంబానీస్ ఫ్యామిలీ ఫ్యాషన్‌కు పలువురు ఫిదా అయిపోతున్నారు.
Video Credits to Viralbhayani 's Ints Id