ఉద్యోగులపై అంబానీ వెడ్డింగ్ ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఒత్తిడి!

by Jakkula Samataha |   ( Updated:2024-07-12 10:00:30.0  )
ఉద్యోగులపై అంబానీ వెడ్డింగ్ ఎఫెక్ట్.. వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఒత్తిడి!
X

దిశ, ఫీచర్ : అపర కుభేరుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. నేడు ఘనంగా అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహం జరుగుతోంది. వీరి వివాహ వేడుకకు ఎంతో మంది అతిరథ మహారథులు హాజరవుతున్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి ఇండియాలోనే, సంప్రదాయ గుజరాతీ పద్ధతిలో ముంబైలో జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోపలు రంగాల ఉద్యోగులకు బిగ్ షాక్ తగిలింది.

ఇక వీరి వివాహం నేపథ్యంలో ముంబైలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. జూలై 12 నుంచి 15 వరకు అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దీంతో ట్రాఫిక్ ప్రాబ్లమ్స్, సెక్యూరిటీ ఆంక్షల నేపథ్యంలో పలు కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ తెలుపుతున్నాయంట. వీరి వివాహ వేడుక చుట్టూ సెబీ,లాంటి అంతర్జాతీయ కంపెనీలు ఉండటంతో వారు తమ కంపెనీ ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నాయంట. దీంతో పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంబానీ వేడుక వలన కామన్ పీపుల్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ వాపోతున్నారు. ఇక ఈరోజు జరగే వివాహ వేడుకకు సెలబ్రిటీస్, రాజకీయనాయకులు , బిజినెస్ మ్యాన్స్ ఇలా ఎంతో మంది హాజరు అవుతున్నారు. దీంతో ముంబైలో హోటల్ రూమ్స్ దొరకడమే కష్టంగా మారిందంట. పలు లగ్జరీ హోటల్స్‌లో ఒక్క రాత్రి స్టే చేయడానికి ఏకంగా లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed