ఆ గ్రామ మహిళలందరికీ నలుగురు, ఐదుగురు భర్తలు.. కాపురం ఎలా చేస్తారంటే..?

by Sumithra |   ( Updated:2023-03-19 09:44:29.0  )
ఆ గ్రామ మహిళలందరికీ నలుగురు, ఐదుగురు భర్తలు.. కాపురం ఎలా చేస్తారంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: హిందూ సంప్రదాయం ప్రకారం ఒక స్త్రీకి ఒక్కరే భర్త.. ఒక పురుషుడికి ఒక్కరే భార్య. బహు భార్యత్వం హిందూ వివాహ చట్టాల ప్రకారం నేరం. కానీ అక్కడక్కడ మొదటి భార్య అంగీకారంతో రెండో భార్యను చేసుకోవడం చూసి ఉంటాం. కానీ ఒక స్త్రీ.. ఒకరికి మించి నలుగురు, ఐదుగురిని ఏక కాలంలో పెళ్లి చేసుకుని కాపురం చేయడం ఎక్కడా చూసి ఉండం. ఇలాంటి ఘట్టం మహాభారతంలో ద్రౌపదికే సాధ్యం అయింది. కానీ నాటి పురాణాల కాలాన్ని మించి ఓ ప్రాంతంలో ఇంట్లో ఉన్న అన్నదమ్ములను మొత్తం వివాహామాడి కాపురం చేస్తున్న మహిళలు ఉన్నారు. ఇది వందల ఏళ్లుగా వస్తున్న ఆచారంగా పాటిస్తున్నారు. అయితే ఈ వింత సంప్రదాయం ఎక్కడ ఉన్నది..? ఒక మహిళ ఎంత మందిని పెళ్లి చేసుకుంటుంది..? కాపురం ఎలా చేస్తుంది..? తదితర ఆసక్తికర విషయాలు తెలియాలంటే ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే..

మనదేశంలోని ఉత్తరాఖండ్‌లోని జౌన్సార్‌-బవార్‌ అనే ప్రాంతంలోని కొన్ని తెగలలో ఈ సాంప్రదాయం కొనసాగేది. అంతే కాకుండా దక్షిణాన నీలగిరులు, అరుణాచల్‌ ప్రదేశ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌లో, డెహ్రాడూన్‌, టోడా తెగలో కొన్ని జాతులలో ఇప్పటికీ ఈ సాంప్రదాయం కొనసాగుందని చెబుతుంటారు. పాండవులు మొదట కొన్ని ఏండ్లపాటు ఈ ప్రాంతంలో నివసించినట్టు పురాణాల చెబుతున్నాయి. ఈ ప్రాంతంలో ఉన్న సమయంలోనే ద్రౌపదితో పాండవుల వివాహం జరిగిందట. అప్పటి నుంచి బహుభర్తల సాంప్రదాయాన్ని ఆ ప్రాంతప్రజలు స్వీకరించినట్టు వారు చెబుతుంటారు. ఈ రోజుకీ కూడా ఈ సాంప్రదాయం ఆయా ప్రాంతాల్లో కొనసాగుతుందట.

కొన్నితెగలలో బహుభర్తల సాంప్రదాయం కొనసాగడానికి మరో కారణం కూడా ఉంది. ఆ ప్రాంతాల్లో ఉండే ప్రతిఒక్క కుటుంబం వ్యవసాయ భూమిపైనే ఆధారపడి జీవిస్తుంటారు. అయితే ఒక్కో ఇంట్లో 5 నుంచి ఆరుగురు మగపిల్లలు ఉంటారు. ఆ అన్నదమ్ములంతా వేర్వేరు అమ్మాయిలను పెళ్లిచేసుకుంటే ఆస్తి పంపకాలు జరిగి కుటుంబ పోషణ భారంగా మారుతుందని వారంతా ఒకే అమ్మాయిని వివాహం చేసుకుంటారట. కుటుంబంలో ఎంతమంది అన్నదమ్ములున్నా వారి కుటుంబాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా ఉంటాయట.

మరో ముఖ్యమైన కారణం ఏంటంటే కొన్ని తెగలలో అమ్మాయిలు తక్కువగా ఉండి, అబ్బాయిల సంఖ్య ఎక్కువగా ఉండడం వలన కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాల్సి వస్తుందని చెబుతుంటారు. అన్నదమ్ములందరినీ వివాహం చేసుకున్న మహిళ రోజుకు ఒకరి చొప్పును కాపురం చేస్తుందట. ఆ సమయంలో ఎవరైతే గదిలో ఉంటారో వారి టోపీని తలుపులకి తగిస్తారట. అప్పుడు మిగిలిన వారు ఎవరూ కూడా ఆ గదిపైపునకు వెళ్లరంట. ఈ సాంప్రదాయం వల్లనే ఇప్పటి వరకు వారి కుటుంబాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తడం లేదని వారు చెబుతుండటం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed