నిద్రపై ప్రభావం చూపుతోన్న ఆల్కహాల్.. కీలక అధ్యయనంలో వెల్లడి!

by Anjali |
నిద్రపై ప్రభావం చూపుతోన్న ఆల్కహాల్.. కీలక అధ్యయనంలో వెల్లడి!
X

దిశ, ఫీచర్స్: సాధారణంగా మందు తాగితే మంచి నిద్ర వస్తుందని భావిస్తారు. కానీ అది ముమ్మాటికీ అవాస్తవం. రాత్రి ఆల్కాహాల్ సేవించడం వల్ల నిద్ర నాణ్యత తగ్గుతుందని తాజాగా ‘నేషనల్ ఇన్‌స్టిట్యూడ్ ఆన్ ఆల్కాహాల్ అబ్యూజ్ అండ్ ఆల్కహాలిజం’ డైరెక్టర్ సీనియర్ సైంటిఫిక్ ‘అడ్వైజర్ ఆరోన్ వైట్’ ఈ విషయాన్ని వెల్లడించారు. మందు తాగడం వల్ల త్వరగా నిద్ర పట్టడానికి అవకాశాలున్నాయి. కానీ ఇది రాత్రంతా నిద్ర భంగానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అర్ధరాత్రి వేళ మద్యం మత్తు పోయిన తర్వాత ‘రీబౌండ్ ఎఫెక్ట్’ ఉంటుందని, దీంతో కొంతమందికి త్వరగా మెలకువ వస్తుందని, మళ్లీ నిద్రపోయేందుకు ఇబ్బంది పడుతుంటారని అడ్వైజర్ ఆరోన్ వైట్ తెలిపారు.

ఆల్కహాల్ తీసుకోవడం వల్ల డ్రిప్రెషన్ నుంచి బయటికొస్తారని అనుకుంటారు. కానీ మందు ఇంకా డిప్రెషన్‌లోకి తీసుకెళ్లి.. ఏం చేస్తారో వారికే అర్థం కాదంటున్నారు నిపుణులు. రాత్రి మందు తీసుకోవడం ద్వారా మెదడు మత్తుకు గురవుతుందని, నిద్ర వివిధ దశల ద్వారా ముందుకు సాగే ప్రక్రియ దెబ్బతింటుందని స్లీప్ మెడిసిన్ అండ్ ఇంటర్నేషనల్ మెడిసిన్ ఫిజిషియన్ అండ్ ఇండియానా స్లీప్ సెంటర్ డైరెక్టర్ అభినవ్ సింగ్ వెల్లడించారు. 2022 లో నిర్వహించిన ఒక పరిశోధన ఒక నెల రోజుల పాటు మద్యం తీసుకోవడం మానేసిన వారిని పరిశీలించింది. ప్రస్తుతం వారు నిద్రను మెరుగుపరుచుకున్నట్లు ఈ అధ్యయనంలో తేలింది.

అలాగే యూకేలో డ్రై జనవరి ఛాలెంజ్‌లో పాల్గొన్న 4000 మందికి పైగా వ్యక్తుల్లో 56 శాతం మంది ఆల్కహాల్ లేకుండా మంచి నిద్రను అనుభవిస్తున్నట్లు తెలిపారు. కాగా ఆల్కహాల్‌ను ఉదయం పూట ఒక గ్లాస్ తీసుకున్నట్లైతే.. అది నిద్రను ప్రభావితం చేయదని, నైట్ డిన్నర్‌తో పాటు తీసుకుంటే దాని ప్రభావం మెదడుపై, నిద్రపై చూపుతుందని అమెరికన్ అకాడమీ ఆఫ్ స్లీప్ మెడిసిన్ ప్రతినిధి, క్లినికల్ సైకాలజిస్ట్ జెన్నిఫర్ మార్టిన్ వివరించారు.

Advertisement

Next Story