- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alcohol Addiction: మనిషి మద్యానికి ఎందుకు బానిసవుతాడు?.. కారణం అదేనా?
దిశ, ఫీచర్స్ : మద్యం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెప్తుంటారు. కానీ ఈరోజుల్లో చాలామంది జీవితంలో అదొక సాధారణ పానీయంలా మారిపోయింది. ఏ చిన్న పార్టీ జరిగినా, ఫంక్షన్‌కు వెళ్లినా అక్కడ మద్యం ఉండాల్సిందే. కొందరైతే సంతోషం అనిపించినా, బాధలో ఉన్నా మద్యం తాగేస్తుంటారు. ఒకప్పుడు పురుషులే ఎక్కువగా తాగేవారు. కానీ ఇప్పుడు ఆడ, మగ తేడాలేకుండా అందరూ డ్రింక్ చేస్తున్నారు.
ఒకసారి అలవాటు పడితే చాలు.. చాలా మంది మద్యానికి బానిసై పోతుంటారు. కొందరిలో ఇది పూర్తి వ్యసనంగానూ మారుతుంది. అయితే అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవడానికి లండన్ కాలేజ్ ఆఫ్ కింగ్స్ పరిశోధకులు ఒక అధ్యయనం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జన్యువులు, మెదడులోని రసాయనాలు ఆల్కహాల్ విషయంలో ఎలాంటి పాత్ర పోషిస్తాయో పరిశీలించారు. కాగా మనిషిలోని RSRF -2 అనే జన్యువు మద్యపానం తాగినప్పుడు డోపమైన రిలీజ్‌కు కారణమై, ఆనందాన్ని ప్రేరేపించడం ద్వారా మళ్లీ మళ్లీ తాగాలనే కోరికను కలిగిస్తుందని, అదే మద్యానికి బానిసగా మారేందుకు కారణం అవుతుందని పరిశోధకులు గుర్తించారు.