Aging Habits : అందాన్ని తగ్గిస్తున్న అలాంటి అలవాట్లు.. యవ్వన ఛాయలు కూడా దూరం!

by Javid Pasha |
Aging Habits : అందాన్ని తగ్గిస్తున్న అలాంటి అలవాట్లు.. యవ్వన ఛాయలు కూడా దూరం!
X

దిశ, ఫీచర్స్ : అందమంటే నలుపూ తెలుపూ ఛాయ కాదిక్కడ. చర్మం రంగుతో సంబంధం లేకుండానే ఉన్నంతలో అట్రాక్టివ్‌గా కనిపించాలనుకోవడమే అసలైన అందంగా నిపుణులు పేర్కొంటున్నారు. నిజానికి తాము అందంగా, యవ్వనంగా, ఆకర్షణీయంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. యంగ్‌గా కనిపించడానికి ప్రయత్నిస్తుంటారు. అయినప్పటికీ కొందరు యవ్వనంలో ఉన్నా జుట్టు రాలడం, ముఖంపై ముడతలు, యవ్వన దశలో కూడా వృద్ధాప్య ఛాయలు కనిపించడం వంటి ఇబ్బందులను ఫేస్ చేస్తుంటారు. అయితే ఇందుకు కొన్ని రకాల బ్యాడ్ హాబిట్స్, ఆరోగ్య సమస్యలు కూడా కారణం అంటున్నారు నిపుణులు. అవేమిటి? ఎలా పోగొట్టుకోవాలో ఇప్పుడు చూద్దాం.

ఒత్తిడి, అధిక రక్తపోటు, డిప్రెషన్

యవ్వనంలో కూడా వృద్ధాప్య ఛాయలకు దారితీస్తున్న పలు కారణాల్లో మానసిక ఒత్తిడి, అధికరక్తపోటు, డిప్రెషన్ వంటివి ఉంటున్నాయని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. కొన్నిసార్లు వీటిని నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన అనారోగ్యాలకు కూడా దారితీయవచ్చు. పైగా తరచుగా స్ట్రెస్‌కు గురికావడంవల్ల మీలో హ్యాపీ హార్మోన్ల విడుదలను అడ్డుకుంటుంది. కార్టిసాల్ వంటి స్ట్రెస్ హార్మోన్ల రిలీజ్‌ను పెంచుతుంది. దీంతో చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలకు దారితీస్తాయి. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలంటే ఒత్తిడిని ఎదుర్కొనే శక్తిని పెంపొందించుకోవాలి లేదా అలాంటి వాతావరణాన్ని దూరం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే హైపర్ టెన్షన్, డిప్రెషన్ వంటివి కూడా అత్యంత వ్వరగా మెదడును ప్రభావితం చేయడం ద్వారా అల్జీమర్స్‌కు, వృద్ధాప్య ఛాయలకు దారితీస్తాయి. కాబట్టి ఈ లక్షణాలను గుర్తిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలంటున్నారు నిపుణులు.

మితిమీరిన ఆహారపు అలవాట్లు

మితిమీరిన ఆహారపు అలవాట్లు, ప్లాస్టిక్ బాటిల్స్ తరచుగా ఉపయోగించడం కూడా మీలో వృద్ధాప్య ఛాయలకు కారణం కావచ్చు అంటున్నారు నిపుణులు. సరైన పోషకాహారం బాడీకి అందకపోవడంవల్ల కూడా ఇలా జరుగుతుంది. దీంతో కండరాలు, ఎముక ద్రవ్యరాశిని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అలాగే వాటిలో కదలికలు మందగించవచ్చు. దీంతో యవ్వన ఛాయలు క్రమంగా కనుమరుగైపోతాయి. అదే విధంగా ఈ రోజుల్లో చాలా మంది ఆహార పదార్థాలను నిల్వచేయడానికి, నీళ్లు తాగడానికి ప్లాస్టిక్ డబ్బాలు, బాటిల్స్ వినియోగిస్తున్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్‌తో నీరు తాగుతున్నప్పుడు అవి తరచుగా పెదవులకు తాకడం కారణంగా కూడా నోటి భాగంలో ముడతలు రావచ్చు. కాబట్టి గాజు లేదా వైడ్ -రిమ్డ్ కంటైనర్ వంటివి ఉపయోగించడం మంచిది అంటున్నారు నిపుణులు.

కెఫిన్, సోడా, నీళ్లు తాగే విధానం

ప్రతిరోజూ మీరు తాగే నీటిని బట్టి కూడా మీ చర్మ ఆరోగ్యం ముడిపడి ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. సరిపడా తాగితే చర్మం, జుట్టు కూడా అందంగా తయారవుతాయి. అవసరం మేరకు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుంది. ఈ పరిస్థతి శరీరంలో యవ్వన ఛాయలను దూరం చేస్తుంది. ఓల్డర్ లుకింగ్ స్కిన్‌కు దారితీస్తుంది. అలాగే కెఫిన్ అధికంగా ఉండే కాఫీ, టీలు ఎక్కువగా తీసుకోవడం, చక్కెర స్థాయిలు అధికంగా ఉండే పానీయాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ప్యాకేజ్డ్ మిల్క్ ప్రొడక్ట్స్ వంటివి మీ గట్ హెల్త్‌ను దెబ్బతీస్తాయి.

డైట్ సోడాలను ఎక్కువగా వినియోగించడం కూడా మెదడు పనితీరు మందగించేందుకు కారణం అవుతాయంటున్నారు నిపుణులు. రోజుకూ రెండుకంటే ఎక్కువగా డైట్ సోడా పోర్షన్స్ యూజ్ చేస్తే స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటివి వచ్చే ప్రమాదం పెరుగుతుంది. అలాగే కొన్ని రకాల స్కిన్ కేర్ ఉత్పత్తులు కూడా రసాయనాలతో నిండి ఉంటాయి. వాటివల్ల కూడా సహజమైన హార్మోన్లకు ఆటంకం ఏర్పడి యవ్వన ఛాయలు కనుమరుగయ్యే చాన్స్ ఉంటుందని నిపుణులు చెప్తున్నారు.

స్క్రీన్ల ముందు అధిక సమయం

ఈరోజుల్లో మొబైల్, టీవీ, ట్యాప్‌ టాప్ వంటివి వాడటం సహజమైపోయింది. అయితే ఒక సమయమంటూ లేకుండా రాత్రింబవళ్లు అధిక సమయం వాటికే కేటాయించడం మీ వయస్సును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ముఖ్యంగా కంటి చూపు మందగించడం, ముఖం తరచుగా లైటింగ్‌కు ఎక్స్‌పోజ్ అవడంవల్ల యవ్వన ఛాయలు పోయి, వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. అలాగే పడుకునే ముందు మొబైల్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం కారణంగా దాని నుంచి వెలువడే బ్లూ లైటింగ్‌ క్రమంగా నిద్రలేమికి, తద్వారా వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది. దీంతోపాటు హెవీ వర్కవుట్స్, హెవీ మేకప్, శారరీక శ్రమ లేకపోవడం, అతి ఆలోచనలు, తరచుగా ఆందోళన చెందడం, టెన్షన్స్ వంటివి యవ్వన ఛాయలను దూరం చేస్తాయి. కాబట్టి ఇలాంటి వాటికి దూరంగా ఉండటమే సరైన పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Next Story