- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ వీడియో చూస్తే చచ్చినా బయటి ఫుడ్ తినలేరు.. (వీడియో)
దిశ, ఫీచర్స్: ఉరుకుల పరుగుల జీవితంలో జనాలు ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఫుడ్ విషయంలో అస్సలు జాగ్రత్తలు తీసుకోవడం లేదు. వంట మానేసి జోమాటో, స్విగ్గి యాప్‌లపై ఆధారపడుతున్నారు. అంతేకాదు.. బయట హోటల్లో, రోడ్ సైడ్ బండిపై అమ్మే బజ్జీలు, పునుగులు తింటూ కడుపు నింపుకుంటున్నారు. ఈ కారణంగా ఎంతోమంది అనారోగ్యం బారిన పడుతున్నారు. బయట ఫుడ్ ప్రిపేర్ చేసేవారు కొంతమంది శుభ్రతను పాటిస్తే.. మరికొంతమంది దోమలు, ఈగలు, పురుగులు ఉన్నది చూసుకోకుండా అలాగే ప్రిపేర్ చేస్తారు. తాజాగా ఇదే కోవకు చెందిన ఓ వంటగదికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో ఒక వ్యక్తి పూరీలు చేస్తున్నాడు. పూరీల కోసం తయారు చేసిన పిండిని ఎలుకలు స్క్రాప్ చేయడం వీడియోలో కనిపించింది.
కాగా పక్కనే కూర్చున్న ఆ వ్యక్తి ఎలుకలను పట్టించుకోకుండా పూరీలు వేయిస్తున్నాడు. ఈ వీడియో పీఎఫ్సీ క్లబ్ వ్యవస్థాపకుడు, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ చిరాగ్ బర్జాత్యా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘‘ఏదైనా ఆహారం తినేముందు వంటగదిని ఓసారి చెక్ చేయండి. ఇది చూడటానికి చాలా ఆందోళనకరంగా ఉంది’’ అంటూ రాసుకొచ్చారు. ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. వీళ్లకు వినియోగదారుల న్యాయస్థానం ద్వారా శిక్ష పడేలా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది ఈ వీడియో క్లిప్ కర్ణిమాత దేవాలయానికి సంబంధించిందని అంటున్నారు.