- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువతలోనూ పెరుగుతున్న డయాబెటిస్.. అసలు కారణాలు ఇవే..
దిశ, ఫీచర్స్ : ఒకప్పుడు 50 ఏళ్లు పైబడిన వారికే ఎక్కువగా డయాబెటిస్ వచ్చేది. కానీ ప్రస్తుతం యువతలోనూ కనిపిస్తోంది. మనదేశంలో 25 ఏళ్లలోపు వయస్సుగల ప్రతి నలుగురిలో ఒకరికి (25.3 %) అడల్ట్ ఆన్‌సెట్ టైప్-2 డయాబెటిస్ ఉంటోందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్ ) నివేదిక పేర్కొంటున్నది. ఇక ప్రపంచవ్యాప్తంగా అయితే ప్రతి 10 మంది వయోజనుల్లో కనీసం ఒకరికి డయాబెటిస్ ఉంటోంది. సుమారు 50.37 కోట్ల మంది ఈ వ్యాధితో బాధపడుతున్నట్లు గణాంకాలు పేర్కొంటున్నాయి. అందుకే జాగ్రత్త పడాలని నిపుణులు సూచిస్తున్నారు. అసలు డయాబెటిస్ ఎందుకు వస్తుంది? దీని బారిన పడకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
జీవనశైలిలో మార్పులు
ఆధునిక జీవన శైలిలో చోటు చేసుకుంటున్న మార్పులు, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్ ముందు గడపడం వంటివి డయాబెటిస్ రావడానికి ప్రధాన కారణాలుగా ఉంటున్నాయి. ప్రస్తుతం వయస్సుతో సంబంధం లేకుండా అందరినీ ఈ సమస్య వెంటాడుతోంది. టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ పలువురిని వేధిస్తుండగా యువత ఎక్కువగా టైప్ 2 డయాబెటిస్ బారిన పడుతోంది. ఆరోగ్యంగా ఉండాలంటే, ముఖ్యంగా డయాబెటిస్ నుంచి తప్పించుకోవాలంటే క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి. నిశ్చల జీవన శైలికి స్వస్తి పలకాలి. రక్తంలో షుగర్ లెవల్స్ ఎప్పుడూ కంట్రోల్లో ఉండేలా చూసుకోవాలి.
ఆహారపు అలవాట్లు
మధుమేహం డెవలప్ అవడానికి ప్రధాన కారకాల్లో ఒకటి ఆహారపు అలవాట్లు. అధిక క్యాలరీలు తీసుకోవడం, అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్స్, హై షుగరింగ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం డయాబెటిస్ రిస్కను పెంచుతున్నాయి. కాబట్టి వాటిని దూరం పెడితేనే డయాబెటిస్ బారి నుంచి తప్పించుకోవచ్చు. ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులు ఆరోగ్యకరమైన తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, పండ్లు, కూరగాయలు రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.
ఒబేసిటీ
ఫిజికల్ యాక్టివిటీస్ తగ్గడం, జంక్ ఫుడ్స్, బయట ప్రాసెస్ చేసిన బేకరీ ఆహారాలు తీసుకోవడం చాలామంది యువతలో అధిక బరువు, ఊబకాయం సమస్యలకు దారితీస్తోంది. డయాబెటిస్ రావడానికి ఇది కారణం అవుతోంది. అందుకే ఒబేసిటీ బారిన పడకుండా చూసుకోవాలి. తరచూ బరువును చెక్ చేసుకోవాలి. సమతుల్య ఆహారం తీసుకోవడం, శారీరక శ్రమ ఉండేలా చూసుకోవడం ఇందుకు దోహదపడతాయి.
జెనెటిక్ ప్రాబ్లమ్స్
అప్పటికే డయాబెటిస్ ఫ్యామిలీ హిస్టరీ కలిగిన కుటుంబాల్లోని యువతలో ఇది మరింత త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఇది గుర్తుంచుకొని కేర్ తీసుకోవాలి. జెనెటిక్ రీజన్స్ మార్చలేనివే అయినప్పటికీ హెల్తీ లైఫ్‌స్టైల్ అలవర్చుకోవడంవల్ల డయాబెటిస్ రిస్క్ నుంచి బయటపడవచ్చు.
క్వాలిటీ స్లీప్ లేకపోవడం
తగినంత నిద్రలేకపోవడం కూడా డయాబెటిస్ రావడానికి దారితీస్తుంది. కాబట్టి ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ కంటినిండా నిద్ర ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా క్వాలిటీ స్లీప్ తప్పక అవసరం. కాబట్టి నిద్రలేమికి కారణం అయ్యే ఆహారం, ఇతర అలవాట్లకు దూరంగా ఉండటం బెటర్.
క్రానిక్ స్ట్రెస్
దీర్ఘకాలిక ఒత్తిడి కూడా యువతలో డయాబెటిస్ రిస్కును పెంచుతోంది. ఇది ఇతర అనారోగ్యాలకు కూడా దారితీస్తుంది. కాబట్టి మరీ ఎక్కువగా ఒత్తిడితో కూడిన పరిస్థితులు ఉంటే వాటిని వీలైనంత వరకు నివారించడానికి ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. సమతుల్య జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ఒత్తిడికి చెక్ పెట్టవచ్చు.
హై బ్లడ్ ప్రెజర్
అధిక రక్తపోటు సమస్య ఉన్నవారిలో మధుమేహం త్వరగా వస్తుంది. నేడు యువతలోనూ హైబీపీ ప్రాబ్లమ్స్ బాగానే పెరిగిపోతున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త పడాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవడం, మానసిక ప్రశాంతతకు ప్రయారిటీ ఇవ్వడం వల్ల అధిక రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. అప్పుడే డయాబెటిస్ రిస్క్ తగ్గుతుంది.