- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెళ్లి పేరుతో అప్పులపాలు అవుతున్న యూత్... ఇదో సరికొత్త ట్రెండ్..
దిశ, ఫీచర్స్ : వివాహ పరిశ్రమ గణనీయమైన మార్పుకు సాక్ష్యంగా నిలిచింది. తమ జీవితంలో ప్రత్యేకమైన రోజును మరింత ప్రత్యేకంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకోసం తల్లిదండ్రులపై ఆధారపడకుండా సొంత నిధులు ఖర్చు చేస్తున్నారు. లేదంటే వ్యక్తిగత రుణాల వైపు మొగ్గుచూపుతున్నారు. ఈ క్రమంలోనే వెడ్డింగ్ లోన్స్ తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఆర్థికంగా అవస్థలు పడుతున్నారు. అసలు ఇలా ఎందుకు, ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? నివేదికలు ఏం చెప్తున్నాయి? తెలుసుకుందాం.
వెడ్డింగ్ లోన్ ట్రెండ్ కు అసలైన కారణాలు వ్యక్తిగతీకరణ, యూనిక్ ఎక్స్ పీరియన్స్, డెస్టినేషన్ వెడ్డింగ్స్, థీమ్డ్ వెడ్డింగ్స్ ప్లాన్ చేసుకోవడం. తద్వారా ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియాలో ధ్రువీకరణ, లైక్‌ల గురించి ఆరాటపడే ఆలోచన. కాగా ఇండియాలెండ్స్ వెడ్డింగ్ స్పెండ్స్ రిపోర్ట్ 2.0 ప్రకారం.. తమ వివాహాలకు స్వయం నిధులు సమకూర్చాలని ప్లాన్ చేసుకున్న 26 శాతం మంది వధూవరులు వ్యక్తిగత రుణాలను పరిగణనలోకి తీసుకుంటారు. రుణం తీసుకోవాలనుకుంటున్న వారిలో 68 శాతం మంది రూ. 1 లక్ష నుంచి రూ. 5 లక్షల మధ్య లోన్ కు ప్లాన్ చేస్తున్నారని నివేదించింది. గ్లోబల్ ట్రావెల్ యాప్ స్కైస్కానర్ ద్వారా 'డెస్టినేషన్ 'ఐ డూ' అనే తాజా సర్వే డెస్టినేషన్ వెడ్డింగ్‌లపై భారతదేశంలో పెరుగుతున్న ప్రేమను వెలుగులోకి తెచ్చింది. దాదాపు 85 శాతం మంది ఇందుకోసం ప్లాన్ చేస్తున్నట్లు తెలిపింది. ఆర్థిక భవిష్యత్తును పణంగా పెడుతున్నారని హెచ్చరించింది.
ఎందుకు అవసరం?
డెస్టినేషన్ వెడ్డింగ్స్ అదనపు ఒత్తిళ్లతో కూడుకుని ఉంటాయి. రిమోట్ లొకేషన్‌లకు వెళ్లడం, వెడ్డింగ్ ప్లానర్‌లను నియమించుకోవడం, లగ్జరీ గ్రూప్ బసలను బుక్ చేసుకోవడం, విస్తృతమైన డెకర్‌లను క్రియేట్ చేయడం వంటి ఖర్చులకు తరచుగా వివాహ రుణాలు అవసరమవుతాయి. అనువైన లోన్ ఎంపికలు, వేగవంతమైన ఆమోదాల సౌలభ్యం ఆర్థికంగా స్వతంత్రంగా ఉన్న జంటలకు వివాహ రుణాలు బెస్ట్ ఆప్షన్ గా మారుతున్నాయి.
చెక్ లిస్ట్
జంటలు తమ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను అంచనా వేయాలి, ఉదాహరణకు వివాహ రుణంపై దృష్టి సారించే ముందు ఇంటిని కొనుగోలు చేయడం, ఆకస్మికత, కుటుంబ నియంత్రణ, ఆస్తి సృష్టి లేదా పదవీ విరమణ కోసం ఏదైనా పక్కన పెట్టడ వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. వివాహమైన వెంటనే ఆర్థిక భారం నుంచి దూరంగా ఉండటానికి కొత్త దంపతులు కోరికలు, ఆర్థిక శ్రేయస్సుతో సౌకర్యవంతంగా సర్దుబాటు చేసే వివాహ వ్యయ ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. పిల్లల పుట్టుక, ఉద్యోగం కోల్పోవడం, వైద్యపరమైన అత్యవసర పరిస్థితులు, మరణం లేదా విడిపోవడం వంటి ఏవైనా సంఘటనలు జరిగినప్పుడు వివాహ లోన్ EMI చెల్లింపుల ఆర్థిక భారాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు నిపుణులు.
అర్హతలు
వివాహ రుణాలను బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFC), ఫిన్‌టెక్ రుణదాతలు ఒకే విధమైన అర్హత ప్రమాణాలతో వ్యక్తిగత రుణాలుగా పరిగణిస్తారు. అర్హత పొందడానికి, రుణగ్రహీతలకు సాధారణంగా మంచి క్రెడిట్ స్కోర్ అవసరం, ప్రాధాన్యంగా 730 కంటే ఎక్కువ. కాగా ఇది బాధ్యతాయుతమైన క్రెడిట్ ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. రుణదాతలకు స్థిరమైన ఆదాయం ఉన్నట్లు ప్రూఫ్ చేసేందుకు బ్యాంక్ స్టేట్‌మెంట్‌లు అవసరం. స్ట్రాంగ్ రిపేమెంట్ హిస్టరీ కీలకం. కాగా రుణాన్ని ఎంచుకునే ముందు రుణగ్రహీతలు తమ ఆర్థిక పరిస్థితిని విశ్లేషించుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. రుణ చెల్లింపులను సౌకర్యవంతంగా నిర్వహించగలరని నిర్ధారించుకోవాలని చెప్తున్నారు.
ఆపదలు
వివాహ రుణాల ప్రధాన ప్రతికూలత ఇతర వ్యక్తిగత రుణాల మాదిరిగానే అధిక వడ్డీ రేట్లు. తిరిగి చెల్లించడంలో వైఫల్యం లేదా వాయిదాల చెల్లింపులో జాప్యం భారీ జరిమానాలకు దారి తీస్తుంది. ఇది క్రెడిట్ స్కోర్‌ను తగ్గించడానికి కూడా దారి తీస్తుంది. పేలవమైన క్రెడిట్ స్కోర్ భవిష్యత్తులో లోన్స్ పొందడం కష్టతరం చేస్తుంది, అలాగే అధిక వడ్డీ రేట్లకు దారి తీస్తుంది. మెచ్యూరిటీకి ముందు రుణాన్ని ఫోర్‌క్లోజ్ చేయడం వలన గణనీయమైన ఛార్జీలు ఉంటాయి.
ప్రత్యామ్నాయాలు
- ఇలా వెడ్డింగ్ లోన్స్ తీసుకుని అప్పుల భారం మోసే బదులు ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలని సూచిస్తున్నారు నిపుణులు. ఆడంబరాలు తగ్గించి బడ్జెట్ ఫ్రెండ్లీ మ్యారేజ్ ప్లాన్ చేసుకోవడం మంచిదని అంటున్నారు.
- పెళ్లి కోసం పర్సనల్ లోన్స్ కు బదులుగా స్టాక్స్, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులపై రుణాలు అందించే ఎంపికలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.
- వ్యక్తిగత రుణాలు తీసుకునే బదులు ఫిక్స్డ్ డిపాజిట్ మనీ వాడుకోవడం మంచిదని సూచిస్తున్నారు.