Hanumankind : మీ ఫేవరేట్ రాపర్ హనుమాన్‌కైండ్ గురించి విశేషాలు.. మీకోసం..

by Sujitha Rachapalli |
Hanumankind : మీ ఫేవరేట్ రాపర్ హనుమాన్‌కైండ్ గురించి విశేషాలు.. మీకోసం..
X

దిశ, ఫీచర్స్ : ఇండియాకు చెందిన రాపర్ ఇంటర్నేషనల్ క్రేజ్ సంపాదించాడు. ఒక్క పాటతో బిల్‌బోర్డ్ గ్లోబల్ చార్ట్ టాప్ టెన్ లో స్థానం దక్కించుకున్నాడు. విభిన్న దేశాల సంస్కృతులకు చెందిన మ్యూజిక్ టచ్ చేస్తూ వరల్డ్ సెన్సేషన్ గా మారాడు. యూట్యూబ్ లో ఆయన సాంగ్ సూపర్ డూపర్ క్రేజ్ తో దూసుకుపోతుంటే.. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నాడు. ఓ సినిమాలోనూ ఛాన్స్ కొట్టేసి.. నేటి తరానికి ఇన్ స్పిరేషన్ గా మారాడు. అతను మరెవరో కాదు మన 'Hanumanakind'.... కాగా ఆయన గురించిన విశేషాలు మీకోసం....

Hanumanakindగా ప్రసిద్ధి చెందిన సూరజ్ చెరుకట్ తన తాజా ట్రాక్ "బిగ్ డాగ్స్"తో విజయాన్ని అందుకున్నాడు. ఈ పాట ఆగస్ట్‌లో బిల్‌బోర్డ్ గ్లోబల్ 200 సింగిల్స్ చార్ట్‌లో ఇరగదీసింది. టాప్ 10లో స్థానం సంపాదించింది. దీంతో కేండ్రిక్ లామర్ వంటి సెలబ్రిటీలను వెనక్కి నెట్టేసిన Hanumankind... బిల్లీ ఎలిష్, సబ్రినా కార్పెంటర్, జిమిన్ వంటి ఇంటర్నేషనల్ స్టార్స్ పక్కన చోటు దక్కించుకున్నాడు. ఇండియాకు చెందిన రాపర్ కు అమేజింగ్ మైల్ స్టోన్ గా నిలిచింది.

భారతదేశంలోని కేరళలో జన్మించిన సూరజ్ చెరుకట్.. తన తండ్రి ఉద్యోగం కారణంగా ప్రపంచవ్యాప్తంగా తిరగాల్సి వచ్చింది. ఫ్రాన్స్, నైజీరియా, ఈజిప్ట్, దుబాయ్ వంటి ప్రదేశాలలో తన బాల్యాన్ని గడిపాడు. చివరకు టెక్సాస్‌లోని హ్యూస్టన్‌లో స్థిరపడ్డారు. కాగా ఈ నగరం రిచ్ హిప్-హాప్ కల్చర్ తో సంబంధం కలిగి ఉండగా... అతని మ్యూజిక్ పాషన్ ను చాలా ప్రభావితం చేసింది. నిజానికి అతను... బిజినెస్ డిగ్రీని చేసి... గోల్డ్‌మన్ సాక్స్ వంటి సంస్థలలో పనిచేసినప్పటికీ అందులో సంతృప్తి పొందలేక పోయాడు. తనకు సంగీతమే కరెక్ట్ అని త్వరగానే గ్రహించాడు. కార్పొరేట్ ప్రపంచాన్ని విడిచిపెట్టి... ర్యాపింగ్‌పైనే పూర్తిగా కాన్సంట్రేట్ చేశాడు. మొత్తానికి ఆయన నమ్మిందే నిజమైంది. ఆ నిర్ణయం ఫలించి... ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా నిలబెట్టింది. అతని ఫస్ట్ సింగిల్ "డైలీ డోస్" తర్వాత.. "బిగ్ డాగ్స్" అతనికి అంతర్జాతీయ ఖ్యాతిని కట్టబెట్టింది. అతని సంగీతం.. భారతీయ వారసత్వం, వరల్డ్ ఇన్ఫ్లుయెన్స్ సమ్మేళనంగా ఉండటంతో... ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులతో రెజొనేట్ అవుతుంది. అందరినీ ఇట్టే కట్టిపడేస్తుంది.

ఇక మ్యూజిక్ పరంగా వావ్ అనిపించిన ఈ రాపర్... ఆషిక్ అబు చిత్రం "రైఫిల్ క్లబ్"తో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ సోషల్ మీడియాను షేక్ చేసింది. Hanumankind స్టామినాను రుజువు చేసింది. మొత్తానికి బిజినెస్ గ్రాడ్ నుంచి గ్లోబల్ రాప్ స్టార్ వరకు ఆయన ప్రయాణం అత్యంత మోటివేషనల్ గా ఉందని అంటున్న అభిమానులు.. మన మనసుకు నచ్చిన పని చేసి సక్సెస్ అయిన Hanumankind యూత్ కు ఆదర్శంగా మారాడని చెప్తున్నారు. ఆయనకు మరిన్ని కీర్తి ప్రతిష్టలు కలగాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed