Career Lessons : తక్కువ టైంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ కెరీర్ లెస్సన్స్ ఫాలో అవండి..

by Sujitha Rachapalli |
Career Lessons : తక్కువ టైంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే ఈ కెరీర్ లెస్సన్స్ ఫాలో అవండి..
X

దిశ, ఫీచర్స్ : కెరీర్ లో ఉన్నత స్థాయికి చేరుకునేందుకు చాలా కష్టపడుతుంటారు. కానీ ఎక్కడో ఒక చోట స్పీడ్ తగ్గిపోతుంది. అక్కడే ఆగిపోతారు. టార్గెట్ మిస్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలంటే ముందుగానే ఇంపార్టెంట్ కెరీర్ లెస్సన్స్ నేర్చుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు. కమిట్మెంట్, హార్డ్ వర్క్ తో పాటు ఇవి చాలా ముఖ్యమని చెప్తున్నారు. అందరికన్నా ముందుగా లక్ష్యాన్ని చేరాలంటే అసలు ఏం ఫాలో కావాలి? అనేది వివరిస్తున్నారు.

ఫ్లెక్సిబిలిటీ

వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. కాబట్టి తాము ఇలాంటి వాతావరణంలోనే పని చేస్తామని పట్టుబట్టుకుని కూర్చోకుండా.. ఉద్యోగులు ఫ్లెక్సిబిలిటీగా ఉండడం నేర్చుకోవాలి. న్యూ ఐడియాస్, న్యూ వర్కింగ్ స్టైల్స్ కు అలవాటు పడిపోవడం మంచిదని సూచిస్తున్నారు ఎక్స్ పర్ట్స్. అప్పుడే మీపై కంపెనీకి మంచి ఒపీనియన్ కలుగుతుందని.. ఇంపార్టెంట్ ఇష్యూస్ డీల్ చేసే అవక్షం ఇస్తుందని చెప్తున్నారు.

కమ్యూనికేషన్

వర్కింగ్ ఎన్విరాన్మెంట్ లో ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ చాలా అవసరం. సుపీరియర్స్, కొలీగ్స్ చెప్పేది యాక్టివ్ గా వింటూనే.. మీరు కూడా మీ అభిప్రాయాలను అనుకున్నది అనుకున్నట్లుగా వ్యక్తపరచడం నేర్చుకోండి. అలాంటప్పుడే మ్యూచువల్ అండర్ స్టాండింగ్ కలుగుతుంది. వర్క్ అనుకున్న టైంలో ఎఫెక్టివ్ గా కంప్లీట్ అవుతుంది. బెస్ట్ అవుట్ పుట్ ఇవ్వగలరు.

ఇనిషియేటివ్

వర్క్ కు సంబంధించిన విషయంలో ఇనిషియేటివ్ తీసుకోవడం అనేది మీరు త్వరగా కెరీర్ లో ఉన్నత స్థాయికి రీచ్ అయ్యేందుకు తోడ్పడుతుంది. ఇలాంటి ఆపర్చునిటీస్ అస్సలు మిస్ కావొద్దని సూచిస్తున్నారు నిపుణులు. పరిష్కారం దొరకని సమస్యలకు సొల్యూషన్ చూపించడం.. మీపై నమ్మకాన్ని పెంచేలా చేస్తుందని అంటున్నారు. ఇలా ఇనిషియేట్ తీసుకోవడం.. మీ డెడికేషన్, లీడర్ షిప్ క్వాలిటీస్ ను చూపిస్తాయని చెప్తున్నారు.

స్ట్రాంగ్ రిలేషన్ షిప్స్

టీం మేట్స్, కొలీగ్స్ తో పాజిటివ్ రిలేషన్షిప్స్ మెయింటేన్ చేయడం కూడా కెరీర్ లెస్సన్స్ లో ఒకటి. కాగా ఇలాంటి రిలేషన్ ట్రస్ట్, రాపోను పెంచగలదని.. టీమ్ వర్క్, కెరీర్ గ్రోత్ కు హెల్ప్ అవుతుందని సూచిస్తున్నారు. దీంతోపాటు ప్రొఫెషనలిజానికి ప్రయారిటీ ఇచ్చినప్పుడు.. రిలయబిలిటీ, రెస్పెక్ట్, ఇంటిగ్రిటీ మీ ఓన్ రెపుటేషన్ ను పెంచగలదు.

మేనేజ్ స్ట్రెస్

స్ట్రెస్ మేనేజ్ చేసేందుకు కొన్ని టెక్నిక్స్ యూజ్ చేయడం నేర్చుకోండి. ఒత్తిడిని డీల్ చేయడం వల్ల ప్రొడక్టివిటీ పెరుగుతుంది. వర్కింగ్ టైంలో ఫుల్ యాక్టివ్ అండ్ ఎనర్జీగా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది. కాగా ఇందుకోసం డీప్ బ్రెత్ టేకింగ్, యోగా లాంటివి ట్రై చేయమని సూచిస్తున్నారు నిపుణులు. ఈ టెక్నిక్ మిమ్మల్ని వేగంగా లక్ష్యాన్ని చేరేందుకు సహాయం చేస్తుందని అంటున్నారు. లేదంటే అనవసర అనారోగ్యాలు దరిచేరుతాయని హెచ్చరిస్తున్నారు.

ఫీడ్ బ్యాక్

మీ వర్క్ గురించి ఫీడ్ బ్యాక్ తీసుకోవడం మరిచిపోవద్దు. ఇది మీరు చేసే తప్పులు నేర్చుకునేందుకు.. మీ కెరీర్ గ్రోత్ కు చాలా సహాయపడుతుంది. కంటిన్యూయస్ లెర్నింగ్, ఫాలోయింగ్ మిమ్మల్ని అందరికన్నా ముందుండేలా చేస్తుంది. కాబట్టి కొత్తగా నేర్చుకునేందుకు ఎప్పుడూ ఆసక్తి కనబరచడం కెరీర్ లెసన్స్ లో బెస్ట్ వన్ గా అభివర్ణిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed