బాడీ పాలిషింగ్ అంటే ఏమిటి? ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది?

by Sujitha Rachapalli |
బాడీ పాలిషింగ్  అంటే ఏమిటి? ఎలాంటి బెనిఫిట్స్ అందిస్తుంది?
X

దిశ, ఫీచర్స్ : బాడీ పాలిషింగ్ అనేది ప్రసిద్ధ చర్మ చికిత్స, కాగా వివిధ స్క్రబ్‌లు, ఆయిల్స్ సహాయంతో చనిపోయిన చర్మ కణాలను తొలగిస్తారు. బాడీ మసాజ్, స్కిన్ మాయిశ్చరైజేషన్‌ను కూడా చేస్తారు. ఇది యవ్వనమైన మెరుపు, మృదువైన చర్మాన్ని అందిస్తుంది. అయితే ఈ ఎక్స్‌ఫోలియేషన్ చికిత్స కోసం మీరు సెలూన్‌కి లేదా క్లినిక్‌కి వెళ్లాల్సిన అవసరం లేదు. ఈ పూర్తి శరీర చికిత్సను ఇంట్లో కూడా చేయవచ్చు.

ఎలా చేయాలి?

  • మృదువైన బాడీ బ్రష్ తీసుకోండి. చర్మాన్ని ఎక్స్‌ఫోలియేట్ చేయడానికి వృత్తాకార కదలికలలో సున్నితంగా బ్రష్ చేయండి. తడి చర్మంపై బాడీ స్క్రబ్‌ని అప్లై చేయండి. మళ్లీ అలాగే ముప్పై సెకన్ల పాటు మసాజ్ చేస్తూ ఉండండి.
  • తర్వాత తేనె, పెరుగు, అలోవెరా జెల్ వంటి పదార్థాలను ఉపయోగించి హైడ్రేటింగ్ బాడీ మాస్క్‌ను అప్లె చేయండి. 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచిన తర్వాత శుభ్రం చేయండి.
  • మీ శరీరాన్ని సరిగ్గా శుభ్రపరచడానికి గోరు వెచ్చని నీరు ఉపయోగించండి. స్నానం చేసేటప్పుడు.. చర్మపు తేమ సమతుల్యత కోసం తేలికపాటి, హైడ్రేటింగ్ షవర్ జెల్ ఉపయోగించండి.
  • స్నానం పూర్తయ్యాక బాదం నూనె లేదా కొబ్బరి నూనె వంటి బాడీ ఆయిల్‌ను అప్లై చేయండి. తేమను లాక్ చేయడానికి మీ చర్మంపై సున్నితంగా మసాజ్ చేయండి.

ప్రయోజనాలు

ఎక్స్ఫోలియేషన్ : బాడీ పాలిషింగ్ ముఖ్య ఉద్దేశ్యం డెడ్ స్కిన్ సెల్స్ ను తొలగించి స్మూత్ టెక్స్చర్ ఇవ్వడం. ఇది ఎక్స్‌ఫోలియేటింగ్ స్క్రబ్‌ను ఉపయోగించడం ద్వారా చేయబడుతుంది. రక్త ప్రసరణలో సహాయం చికిత్సలో వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేయడం జరుగుతుంది. 2005లో స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన పరిశోధన ప్రకారం.. బాడీ మసాజ్ రక్త ప్రసరణను పెంచడం, కండరాల ఒత్తిడిని తగ్గించడం వంటి ప్రయోజనాలను అందిస్తుంది . అలాగే శరీరాన్ని వృత్తాకార పద్ధతిలో మసాజ్ చేసినప్పుడు.. పోషకాలు బాగా గ్రహించబడతాయి. చర్మ కణాలకు రక్త ప్రసరణ సరిగ్గా జరుతుంది.

మచ్చల తగ్గింపు : బాడీ పాలిషింగ్ చికిత్స.. చర్మపు మచ్చలు, మొటిమల మచ్చలు కనిపించడాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. ఈ ప్రక్రియలో ఉపయోగించిన ఎక్స్‌ఫోలియేటర్‌లు రంగు మారిన ప్రాంతాన్ని పోగొట్టి.. చర్మం సమానంగా మృదువుగా కనిపించేలా చేస్తాయి.

ఒత్తిడి తగ్గింపు: సైంటిఫిక్ రిపోర్ట్స్‌లో ప్రచురించబడిన 2020 అధ్యయనంలో 10 నిమిషాల బాడీ మసాజ్ ఒత్తిడిని అధిగమించడానికి, శరీర వ్యవస్థను సరిగ్గా చేయడంలో సహాయపడుతుందని కనుగొంది. బాడీ పాలిషింగ్ అనేది రిలాక్సేషన్ టెక్నిక్. ఇది మీకు ఒత్తిడి లేని, రిలాక్స్‌డ్ అనుభవాన్ని అందించడంలో సహాయపడుతుంది. రిథమిక్, సర్క్యులర్ మసాజింగ్ టెక్నిక్ ఓదార్పు, ప్రశాంతమైన అనుభవాన్ని అందించడానికి సహాయపడుతుంది.

స్కిన్ మాయిశ్చరైజేషన్:

ఎక్స్‌ఫోలియేషన్ ప్రక్రియను మాస్క్‌లు, షవర్ జెల్, ఆయిల్ ఉపయోగించి చేస్తారు. మృత చర్మ కణాలు తొలగించబడిన తర్వాత అవి చర్మంలోకి బాగా శోషించబడతాయి. స్కిన్ మాయిశ్చరైజ్డ్ గా ఉంటుంది.

టాన్ తొలగిస్తుంది: అసమాన స్కిన్ టోన్ లేదా టాన్డ్ స్కిన్ ఉన్నవారికి ఇది బెస్ట్ చాయిస్. ఉదాహరణకు మీరు ఈ చికిత్సలో పెరుగును ఉపయోగిస్తే.. ఇందులోని లాక్టిక్ యాసిడ్ కారణంగా హైపర్పిగ్మెంటేషన్‌ను ఎదుర్కోగలదు.

Advertisement

Next Story

Most Viewed