- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జూన్ 14 తర్వాత ఆధార్ పనిచేయదా..? ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన యూఐడీఏఐ!
దిశ, ఫీచర్స్: ఆధార్‌కార్డులోని వ్యక్తిగత వివరాలను జూన్ 14 లోపు అప్‌డేట్ చేయకపోతే కార్డు పని చేయదంటూ వస్తున్న వార్తలపై భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) స్పష్టతనిచ్చింది. వివరాల్లోకి వెళితే..
అలా వస్తున్న వార్తలను నమ్మకూడదని స్పష్టం చేసింది. ఆధార్‌లోని వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకోవడానికి జూన్ 14 గడువు విధించినట్లు.. ప్రభుత్వం నిర్ణయించిన గడువులోపు మార్చుకోకపోయినా ఆధార్ పనిచేస్తుందని స్పష్టం చేసింది. తర్వాత కూడా వివరాలు మార్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఆధార్ సెంటర్లలో నిర్దేశిత రుసుము చెల్లించి వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చని పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్‌డేట్ చేసుకునేందుకు ఉడాయ్ గతంలో 2023 డిసెంబర్ 14 వరకు అవకాశం ఇచ్చింది. తర్వాత దాన్ని రెండుసార్లు పొడిగించి చివరగా జూన్ 14 గడువు విధించింది. ఆలోపు ఆన్‌లైన్‌లో తగిన పత్రాలు సమర్పించి ఉచితంగా వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు.
ఉడాయ్ వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయ్యి కూడా ఉచితంగా వివరాలు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఇందులో భాగంగా తాజా గుర్తింపు కార్డు, అడ్రస్ వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. రేషన్ కార్డు, ఓటర్ ఐడీ, కిసాన్ పాస్‌బుక్, పాస్‌పోర్ట్ వంటివి గుర్తింపు, చిరునామా రెండింటికీ ధ్రువీకరణ పత్రాలుగా వినియోగించుకోవచ్చు. టీసీ, మార్క్‌షీట్, పాన్/ఇ-పాన్, డ్రైవింగ్ లైసెన్స్ వంటివి గుర్తింపు ధ్రువీకరణ పత్రంగా విద్యుత్, నీటి, గ్యాస్, టెలిఫోన్ బిల్లులను (మూడు నెలలకు మించని) చిరునామా ధ్రువీకరణ పత్రంగా ఉపయోగించుకోవచ్చని ఉడాయ్ పేర్కొంది.