- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
యువకుడి వింత ఆలోచన.. పెళ్లి చేస్తానని మాటిచ్చిన ఎస్ఐ!
దిశ, వెబ్‌డెస్క్: ఒక వయసు వచ్చాక యువతీ, యువకులకు పెళ్లి చేయడం అనేది కామన్. సరైన ఏజ్‌లో పెళ్లి చేసుకోవాలి అంటారు. కానీ కొందరు తమ పిల్లలకు పెళ్లి చేసుకునే వయసు వచ్చినా పెళ్లి చేయరు. దీంతో వారి స్నేహితులందరికీ పెళ్లి అవుతుంటే, తనకు కావడంలేదని కొందరు మానసికంగా కుంగిపోతుంటారు.
అయితే అలానే ఓయుకుడికి పెళ్లి వయసు వచ్చింది. కానీ తనకు పెళ్లి చేయాలని తన కుటుంబ సభ్యులు ఆలోచించకపోవడంతో, యువకుడు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. దీంతో ఏం చేయాలో అర్థం కాని ఆ యువకుడు వినూత్నంగా ఆలోచించి, ఏకంగా ఎస్‌ఐకి లేఖ రాశారు.
అందులో ఏముందంటే.. సార్ నా పేరు మితురాయ్.. నా వయసు 30 సంవత్సరాలు. నాకు పెళ్లి చేసుకునే వయసు వచ్చిందని నాకు తెలుసు. కానీ నా కుటుంబ సభ్యులు ఆ విషయం గ్రహించడం లేదు. నాకు పెళ్లి కాకపోవడంతో నేను ప్రశాంతం ఉండలేకపోతున్నా ఎలాగైనా నాకు దయచేసి పెళ్లి జరిగేలా చూడండి. అంటూ కోరాడు. దీంతో ఎస్ఐ యువకుడిని పిలిపించి నీకు పెళ్లి చేస్తానని మాటిచ్చాడు. ప్రస్తుతం ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోంది.
- Tags
- lifestyle