అక్క వక్షోజాలు పెద్దగా ఉన్నాయని మామయ్య టెంప్ట్ అయ్యాడు.. కానీ నన్నెందుకు..?

by Nagaya |   ( Updated:2023-06-14 05:58:42.0  )
అక్క వక్షోజాలు పెద్దగా ఉన్నాయని మామయ్య టెంప్ట్ అయ్యాడు.. కానీ నన్నెందుకు..?
X

నమస్తే...

నన్ను, నా అక్కను మా మేన మామ వేధించాడు. అసభ్యంగా టచ్ చేస్తూ హింసించాడు. ఈ విషయాన్ని అమ్మకు చెప్పాం. కానీ మా మదర్ ఈ విషయంలో నా అక్కను బ్లేమ్ చేసింది. ఆమెకు బూబ్స్ ఎక్కువగా ఉన్నాయని, అందుకే అతను టెంప్ట్ అవుతున్నాడని అరిచింది. ప్రాపర్‌గా దాచుకోవాలని తిట్టిపోసింది. ఎందుకంటే మా అమ్మ తన అన్నతో బంధాన్ని తెంచుకోలేకపోయింది. దీంతో ఈ ఘటన తర్వాత కొన్నేళ్ల వరకు మా అమ్మతో సరిగ్గా మాట్లాడలేకపోయాను.

ఒకసారి ఆలోచించండి నాకు ఏడేళ్లు, అక్కకు పదేళ్లు. అప్పుడు నాకు తెలియదు నేను లైంగికంగా వేధించబడుతున్నాని. చక్కిలిగింత అనుకుని పట్టించుకునేదాన్ని కాదు. రెండేళ్ల పాటు అంటే నాకు తొమ్మిదేళ్లు వచ్చే వరకు ఇదే పద్ధతి కొనసాగింది. ఆ టైమ్‌లో మా అక్క వక్షోజాలను మామ తాకడం చూశాను. అది రాంగ్ అనిపించింది. అమ్మకు చెప్పినా ఫలితం లేదు కాబట్టి నా సిస్టర్ శవం మాదిరిగా కింద కుప్పకూలిపోయి ఏడ్చింది. నాకూ ఏం చేయాలో తెలియక ఆడుతూ, గెంతుతూ ఉండేదాన్ని. కానీ మామయ్య మా ఇంటి నుంచి వెళ్లిపోయాక జరిగిన విషయం అమ్మకు చెప్పాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు. కానీ రెండేళ్ల తర్వాత అమ్మ, అక్కను బ్రెస్ట్ ప్రాపర్‌గా మేనేజ్ చేసుకోవాలని తిట్టడం గమనించాను.

వక్షోజాలు పెద్దవిగా ఉన్నాయి కాబట్టే మామయ్య అట్రాక్ట్ అవుతున్నాడని, టచ్ చేస్తున్నాడని అమ్మ ఆలోచన. కానీ ఇప్పటి వరకు అర్థం కాలేదు.. నన్నెందుకు అసభ్యంగా తాకేవాడు అని. అంటే అతన్ని నేనెలా టెంప్ట్ చేశాననేది ఇప్పటికీ అర్థం చేసుకోలేకపోతున్నా. అతను ఎప్పుడైనా వస్తే ఫేస్ చేయలేకపోతున్నా. అతను హ్యాపీగానే, ఏం తెలియనట్లుగానే, ఏం జరగనట్లుగానే జీవిస్తున్నాడు. కానీ నేను అలా నార్మల్‌గా ఉండలేకపోతున్నా. వాళ్లకు ఇది చాలా ఈజీ.. కానీ మనకెందుకు హార్డ్?..

- వైరల్ అవుతున్న ఓ ట్వీట్

దిశ, ఫీచర్స్: భారతదేశంలో వేధించేవారిని కుటుంబాలు చక్కగా కాపాడతాయని అనేందుకు ఈ ట్వీట్ ఒక ఉదాహరణ. వేధింపుల గురించి బయటకు వినిపిస్తే పరువు ఏమై పోతుందనే దరిద్రపు భావజాలం.. ఇలాంటివి నివేదించకుండా బాధితురాలి నోటిని నొక్కేస్తుంది. దీంతో దోషులు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతారు. అద్భుతమైన మరణాన్ని పొందుతారు. కానీ మన గొప్ప భారతీయ కుటుంబ సంస్కృతిలో ఇలాంటి నీచపు అలవాట్లు, పద్ధతులు భాగం కావడం నిజంగా శోచనీయం. వక్షోజాలు పెద్దగా ఉన్నందుకు తల్లి తన కూతురిని అవమానిస్తే.. చాలా చిన్న వయస్సులో ఉన్న ఆ అమ్మాయిలో ఎలాంటి భావం కలుగుతుందో ఓ సారి ఊహించుకోండి. తమ శరీరాలను అసహ్యించుకుంటూ పెరగరా? తన వక్షోజాల వల్లే ఇదంతా జరుగుతుందని తమను తాము అవమానించుకోరా? పైగా అకస్మాత్తుగా ఈ గాయం అంతా మరచిపోయి ఓ అపరిచితుడిని వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలంటే సాధ్యమవుతుందా? ఆ అమ్మాయి మెంటల్‌గా ఎంత స్ట్రగుల్ అవుతుంది? ఓ సారి ఆలోచించండి.

Also Read: సెక్స్, ఎక్స్ గురించి లవర్‌తో మాట్లాడితే అంతే సంగతులు.. పర్యావరణం కూడా అనుకూలించదు..

Advertisement

Next Story

Most Viewed