strange custom : 'ముందు చెంపదెబ్బ తినండి.. తర్వాత ఫుడ్ వడ్డిస్తాం' రెస్టారెంట్ లో వింత ఆచారం..

by Sumithra |
strange custom : ముందు చెంపదెబ్బ తినండి.. తర్వాత ఫుడ్ వడ్డిస్తాం రెస్టారెంట్ లో వింత ఆచారం..
X

దిశ, వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డెస్క్ : ఇంట్లో వండిన ఆహారం తింటూ బోర్ కొట్టినప్పుడల్లా ఛేంజ్ కోసం రెస్టారెంట్లకు వెళ్తుంటాం. అలా వెళ్లినప్పుడు కూడా ప్రత్యేకత ఉన్న రెస్టారెంట్లకు వెళ్లేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాం. ఫుడ్‌లోనో లేదా చుట్టు వాతావరణంలోనో ప్రత్యేకత ఉన్న చోట వెళ్లుతుంటాం. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి హోటళ్లు, రెస్టారెంట్లు అనేకం ఉన్నాయి. వాటి వాటి ప్రత్యేకతలతో చాలా ఫేమస్ అయి ఉంటాయి.

ఇప్పుడు అలాంటి ఒక రెస్టారెంట్ గురించి మనం తెలుసుకుందాం. ఈ రెస్టారెంట్‌కి వచ్చే కస్టమర్లకు విచిత్రంగా చెంపదెబ్బలతో స్వాగతం పలుకుతారట అక్కడి స్టాఫ్. ఏంటి చెపందెబ్బలా ఇదేం విచిత్రం రా నాయనా అనుకుంటున్నారా.. ఈ రెస్టారెంట్ స్పెషల్ అంట. ఇంతకీ ఈ విచిత్రమైన రెస్టారెంట్ ఎక్కడ ఉందంటే జపాన్‌లో ఉందట.

ఈ జపనీస్ రెస్టారెంట్ పేరు షాచిహోకోయా-యా. ఇది జపాన్ లోని నగోయాలో ఉంది. ఇక్కడ వెయిట్రెస్‌లు వచ్చిన కస్టమర్లను చెంపదెబ్బతో స్వాగతిస్తారు. ఇక్కడికి వచ్చే ప్రజలు కచ్చితంగా 300 జపనీస్ యెన్‌లు అంటే 169 రూపాయలు ఖర్చు చేస్తారట. సాంప్రదాయ జపనీస్ దుస్తులు ధరించిన వెయిట్రెస్‌లు వచ్చిన వారిని చెంపదెబ్బ కొట్టినప్పుడు కొన్నిసార్లు వారు కింద పడిపోతారట. వీడియో చూసిన వారంతా ఇదేం వింత విచిత్రం రా నాయనా అనుకుంటున్నారు. ఈ తప్పాడ్ కాన్సెప్ట్ వల్ల ఈ రెస్టారెంట్ బాగా పాపులర్ అయిందని చెబుతున్నారు.

క్యూరియాలజిస్ట్ అనే ఖాతా నుండి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దీనికి సంబందించిన వీడియో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోకి జపాన్ స్లాప్ బార్ అని క్యాప్షన్‌లో రాశారు. మీడియా నివేదికల ప్రకారం షచిహోకోయా-యా 2012లో స్టార్ట్ చేశారు.

Video credits by curiologist

Advertisement

Next Story