మహిళల బ్రెయిన్‌ను కుదిపేస్తున్న లింగ అసమానత : తాజా అధ్యయనం

by Aamani |   ( Updated:2023-05-15 12:16:46.0  )
మహిళల బ్రెయిన్‌ను కుదిపేస్తున్న లింగ అసమానత : తాజా అధ్యయనం
X

దిశ, ఫీచర్స్ : ఎఫెక్టెడ్ బ్రెయిన్ ఏరియాస్ ముఖ్యంగా స్ట్రెస్, ఎమోషన్స్‌తో సంబంధం కలిగి ఉంటాయని.. డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ వంటి ఒత్తిడి సంబంధిత రుగ్మతలతో ప్రభావితం అవుతాయని ఒక అధ్యయనం పేర్కొన్నది. భారతదేశం సహా వరల్డ్ రీసెర్చర్స్ రిజల్ట్స్ ప్రకారం జెండర్ ఇన్‌ఈక్వాలిటీ పురుషులు, మహిళల మెదడుల నిర్మాణంలో తేడాలతో ముడిపడి ఉంటుంది. లింగ అసమానత్వం అధికంగా ఉన్న దేశాల్లో.. మహిళల మెదడు కుడి అర్ధగోళం(right hemisphere of women's ) కార్టికల్ మందం(cortical thickness ) పురుషుల కంటే సన్నగా ఉందని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ప్రొసీడింగ్స్ జర్నల్‌లో పబ్లిషైన స్టడీ పేర్కొన్నది.

జెండర్ ఈక్వాలిటీ దేశాల్లోనూ అంతే..

జెండర్ ఈక్వాలిటీ ఉన్న దేశాల్లోనూ పెద్దగా తేడా లేదని పరిశోధకులు అంటున్నారు. మెదడు ప్రభావిత ప్రాంతాలు ముఖ్యంగా ఒత్తిడి, భావోద్వేగాలతో సంబంధం కలిగి ఉంటాయని చెప్తున్నారు. ‘మెదడు నిర్మాణంలో కొన్ని లైంగిక వ్యత్యాసాలు చాలా మంది మహిళలు నివసించే ప్రతికూల సామాజిక వాతావరణంతో ముడిపడి ఉన్నాయని మా ఎనాలిసిస్‌ సూచించింది’’ అని యూకేలోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో డిపార్ట్ మెంట్ ఆఫ్ సైకియాట్రి విజిటింగ్ ప్రొఫెసర్ డాక్టర్ నికోలస్ క్రాస్లీ అన్నారు. అందువల్ల మనం చూస్తున్నది, జెండర్ ఇన్‌ఈక్వాలిటీ వాతావరణంలో మహిళల మెదడుల్లో క్రానిక్ స్ట్రెస్ ఎఫెక్ట్‌గా భావిస్తున్నట్లు అతను పేర్కొన్నాడు.

అధ్యయనంలో భాగంగా పరిశోధకులు యూకే, యూఎస్, చైనా, లాటిన్ అమెరికా, ఇండియా సౌత్ ఆఫ్రికా వంటి దేశాల నుంచి 4078 మంది మహిళలు, 3798 మంది పురుషులను పరిశీలించారు. వారి మెదళ్లకు సంబంధించిన ఎంఆర్ఐ స్కాన్‌లను విశ్లేషించారు. పరిశోధకుడు క్రాస్లీ ప్రకారం.. స్ట్రెస్ న్యూరాన్ల కనెక్షన్‌లను ప్రభావితం చేస్తుందని, ఎంఆర్ఐ స్టడీస్‌లో ‘ గ్రే మ్యాటర్ కార్టెక్స్’ సన్నబడటాన్ని గమనించవచ్చు. అయినప్పటికీ మహిళల మెదడుల్లో ఎడ్యుకేషన్ సహా తగ్గిన అవకాశాల ప్రభావం, అదర్ మెకానిజమ్స్ కూడా చేరి ఉండవచ్చు. ఇది కనెక్షన్ల తక్కువ డెవలప్‌మెంట్‌కు దారి తీస్తుందని పరిశోధకులు అంటున్నారు. ఈ ఫలితాలు లింగ అసమానత, మానసిక అనారోగ్య సమస్యలు, తగ్గిన ఎడ్యుకేటెడ్ వర్క్ స్టైల్ మధ్య తలెత్తే నాడీ సంబంధాన్ని సూచిస్తున్నాయి. మహిళల బ్రెయిన్స్‌పై జెండర్ ఇన్‌ఈక్వాలిటీ డేంజరస్ ఎఫెక్ట్‌ను సూచిస్తుందని అధ్యయనకర్తలు చెప్తున్నారు. ఈ పరిశోధన జెండర్ ఈక్వాలిటీ విధానాలను తెలియజేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని.. అయితే ఇది ఎలా, ఎప్పుడు జరుగుతుందో తెలుసుకోవడానికి మరింత పరిశోధన అవసరమని నిపుణులు పేర్కొన్నారు.

Read more:

మెదడును మాయ చేస్తున్న కళ్లు.. ఇలాంటి ట్రిక్స్ అసలు ఊహించలేము

Advertisement

Next Story

Most Viewed