మిస్టీరియస్ స్కల్.. కొత్తగా కనుగొన్న పుర్రెకు రుజువులు దొరకడం లేదంటున్న సైంటిస్టులు

by samatah |
మిస్టీరియస్ స్కల్.. కొత్తగా కనుగొన్న పుర్రెకు రుజువులు దొరకడం లేదంటున్న సైంటిస్టులు
X

దిశ, ఫీచర్స్ :సైంటిస్టులు మానవ ఆకారాన్ని పోలిన ఒక కొత్త పుర్రెను తూర్పు చైనాలోని హువాలోన్‌డాంగ్‌లో పురావస్తు వత్వకాల సందర్భంగా కనుగొన్నారు. అయితే పరిశోధనల్లో మాత్రం ఏ మానవ వంశంతోనూ సరిపోలని కారణంగా అది అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నియాండర్తల్స్, డెనిసోవాన్స్ లేదా నేటి ఆధునిక మానవులకు సంబంధించింది అని చెప్పడానికి ఇంకా ఎటువంటి ఆధారాలు లభించలేదు. అయినప్పటికీ ఈ స్కల్ వివిధ మావవ వంశాలకు సరిపోయే ముఖ కవళికలు, దవడ, కొన్ని ఎముకలను మాత్రం కలిగి ఉంది.

కొత్తగా కనుగొన్న మిస్టీరియల్ స్కల్ 12 నుంచి13 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లవాడికి చెందినది కావచ్చునని కొందరు భావిస్తున్నప్పటికీ సరైన రుజువులు లేవు. ఇక సైన్స్ అలర్ట్ కథనం అంచనా ప్రకారం అది సుమారు మూడు లక్షల సంవత్సరాల క్రితం జీవించి ఉన్న ఒక వ్యక్తికి చెందినదని పేర్కొన్నప్పటికీ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవు. దీంతో ఆ పుర్రె ఇది వరకు కనుగొనబడని ఆదిమ మానవల్లోని కొత్త శాఖకు చెందినది కావచ్చునని చైనాకు చెందిన జియాటాంగ్ యూనివర్సిటీ, యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ యార్క్, స్పెయిన్‌లోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ హ్యూమన్ ఎవల్యూషన్ పరిశోధకులు అంటున్నారు. మరికొందరు హోమినిన్ లేదా మానవ కుటుంబ వృక్షానికి మరొక శాఖ అయి ఉండవచ్చునని అభిప్రాయపడుతున్నారు. పుర్రె ముఖం ఆధునిక మానవ లక్షణాలను కలిగి ఉండగా, అవయవాలు, స్కల్ క్యాప్, దవడ మరింత ప్రాచీన లక్షణాలను ప్రతిబింబిస్తున్నట్లు కనిపిస్తున్నాయి. పైగా గడ్డం కూడా లేకపోవడంతో ఒకప్పుడు ఆసియాలో ఉనికిలో ఉన్న డెనిసోవన్‌ తెగకు చెందినది కావచ్చునని కూడా సైంటిస్టులు అనుమానిస్తున్నారు.

Read More: కలలో మంటలు లేదా అగ్ని కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

Next Story