viral: చిన్నారి ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై కూర్చోబెట్టుకొని ప్రమాదకర విన్యాసాలు

by Javid Pasha |
viral: చిన్నారి ప్రాణాలతో చెలగాటం.. బైక్‌పై కూర్చోబెట్టుకొని ప్రమాదకర విన్యాసాలు
X

దిశ, ఫీచర్స్: అతివేగం ప్రమాదకరమని తెలిసినా కొందరు అదేదీ పట్టనట్టు 90 స్పీడ్‌లో వెళ్తుంటారు. బైక్‌పై వెరైటీ స్టంట్లు ప్రాణాంతకమని చెప్పినా సరదా పేరుతో కొనసాగిస్తూనే ఉంటారు. ఇలాంటి ప్రయత్నాలవల్ల తాము రిస్కులో పడటమే కాకుండా కొన్నిసార్లు ఇతరుల ప్రాణాలతో కూడా చెలగాటమాడుతుంటారు. అలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతోంది.

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఓ యువకుడు చిన్నారిని బైకుపై ముందు భాగంలో కూర్చో బెట్టుకొని హైవేపై వేగంగా వెళ్తున్నాడు. అంతటితో ఆగకుండా హ్యాండిల్‌ను వదిలేసి డేంజరస్ స్టంట్లు చేయడం మొదలు పెట్టాడు. అలా వెళ్తుండగా మధ్యలో ఓ ఎద్దు అడ్డం వచ్చింది. దానిని తప్పించుకొని ముందుకు వెళ్లాడు. అయినా ఆగకుండా ప్రమాదకర విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, అది చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ‘నువ్వు రిస్కులో పడింది కాకుండా చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నావు’ అంటూ తిట్టిపోస్తున్నారు. కాగా ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లోని సీతాపూర్‌లో జరిగినట్లు తెలుస్తోంది. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, డేంజర్ స్టంట్లు చేస్తూ చిన్నారి ప్రాణాలతో చెలగాటమాడిన ఆ యువకుడిపై చర్యలు తీసుకోవాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed