Communication Skills : మీరే బెస్ట్ క్యమూనికేటర్‌.. ఇలా వ్యవహరించినప్పుడు మాత్రమే!

by Javid Pasha |   ( Updated:2024-09-12 16:08:56.0  )
Communication Skills : మీరే బెస్ట్ క్యమూనికేటర్‌.. ఇలా వ్యవహరించినప్పుడు మాత్రమే!
X

దిశ, ఫీచర్స్ : నలుగురిలో తాము బెస్ట్‌గా ఉండాలని, సమాజంలో మంచి గుర్తింపు, గౌరవం పొందాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ వివిధ కారణాలవల్ల కొందరు వెనుక బడుతుంటారు. అయితే దీనిని అధిగమించడంలో మీరు కమ్యూనికేట్ చేసే పద్ధతి కూడా ఉపయోగపడుతుందని మానసిక నిపుణులు చెప్తున్నారు. అందుకే బెస్ట్ కమ్యూనికేటర్‌గా ఉండాలని సూచిస్తున్నారు. అందుకు ఉపయోగపడే కొన్ని ట్రిక్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

* మీకు చాలా విషయాలు తెలిసి ఉండవచ్చు. కానీ రాతల్లో, మాటల్లో, చేతల్లో, హావ భావాల్లో ఏదో ఒక రూపంలో వాటిని ప్రజెంట్ చేయడాన్నే కమ్యూనికేట్ చేయడమని నిపుణులు పేర్కొంటున్నారు. అలా చేయకపోతే మీ గురించి ఇతరులకు తెలిసే అవకాశం ఉండదు. దీంతో మీరు అనేక అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉంది. సరైన కమ్యూనికేషన్ లేకపోవడంవల్ల మీరున్న రంగంలో కూడా రాణించడం కష్టం. కాబట్టి ఏదో ఒక రూపంలో ఇతరులను కమ్యూనికేట్ చేసే సత్తా మీరు సంపాదించుకోవాలంటున్నారు నిపుణులు. దీంతో మీమీద మీకు నమ్మకం కలుగుతుందని, ఆత్మ విశ్వాసం ఏర్పడుతుందని, అది మీ సక్సెస్‌కు దారితీస్తుందని చెప్తున్నారు.

* అలాగే కుటుంబంలో గానీ, వర్క్ ప్లేస్‌లో గానీ వ్యహరించే తీరు కూడా మీ కమ్యూనికేషన్ పద్ధతిని తెలియజేస్తుంది. అది సక్రమంగా లేకపోతే అవతలి వ్యక్తులకు మీపట్ల నమ్మకం ఏర్పడదు. ఎక్కువగా మీ వైపు నుంచే ఆలోచించడం, ఇతరులకు నచ్చకపోయినా మీరు చెప్పిందే వినాలనుకోవడం వంటివి చేస్తుంటే ఎన్నటికీ మంచి కమ్యూనికేటర్ కాలేరని నిపుణులు చెప్తున్నారు. అందుకే సందర్భాన్ని బట్టి, నలుగురిని దృష్టిలో ఉంచుకొని వారికి నచ్చేలా వ్యవహరించడం ఉత్తమ కమ్యూనికేషన్‌లో భాగంగా నిపుణులు పేర్కొంటున్నారు. ఉదాహరణకు మీరు మాట్లాడుతున్నప్పుడు ‘ నేను చేశాను, నేనైతేనే ఆ పని బాగా చేయగలను, నేను మాత్రమే అలాంటి టాలెంట్ కలిగి ఉన్నాను’ వంటి మాటలు మాట్లాడవద్దు అంటున్నారు నిపుణులు. దీనికి బదులు మనం చేయగలం, మనం ప్రయత్నించాలి. మనతోనే సాధ్యం, మనకు ఆ సామర్థ్యం ఉంది వంటి పదాలను ప్రయోగించడంతో నలుగురిలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు వ్యక్తిగతంగా లేదా టీమ్‌గా చేసే పనిలో కూడా అవతలి వారు సహకరిస్తారు. ఇక్కడ నలుగురిని ఆకట్టుకోవడం, నలుగురితో కలిసి నడవడం, పనిలో మంచి ఫలితాలు రాబట్టడం కూడా బెస్ట్ కమ్యూనికేషన్ అని గుర్తుంచుకోండి.

* కొందరు ఇతరుల అభిప్రాయాలను, ఇష్టాలను, నమ్మకాలను ఏమాత్రం పట్టించుకోరు. తమకు తెలిసిందే సర్వస్వం అనుకుంటారు. ఇతరులు కూడా తమను అనుసరించాలని భావిస్తుంటారు. ఇతరుల ఇష్టాయిష్టాలను, నమ్మకాలను గౌరవించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇలాంటి వ్యక్తిత్వంగలవారు ఎన్నటికీ బెస్ట్ క్యమూనికేటర్ కాలేరని నిపుణులు చెప్తున్నారు. ఇతరుల ఆసక్తులు, అభిరుచులు, అభిప్రాయాలు, నమ్మకాలను కూడా పరిగణనలోకి తీసుకొని అందరికీ నచ్చేలా నడుచుకోవడమే బెస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్‌గా సైకాలజిస్టులు పేర్కొంటారు. మొత్తానికి మీ మాటతీరు, ప్రవర్తన ఇతరులను ఆకట్టుకునే విధంగా, స్ఫూర్తినిచ్చే విధంగా, ఆలోచింపజేసే విధంగా ఉన్నప్పుడే మీరు బెస్ట్ క్యమూనికేటర్‌గా నిలుస్తారని నిపుణులు పేర్కొంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed