కుళ్లిన మొక్కల్లో కొత్తరకం బ్యాక్టీరియా.. వ్యాధులను ఎదుర్కోవడం ఇక చాలా ఈజీ !

by Javid Pasha |
కుళ్లిన మొక్కల్లో కొత్తరకం బ్యాక్టీరియా.. వ్యాధులను ఎదుర్కోవడం ఇక చాలా ఈజీ !
X

దిశ, ఫీచర్స్ : సూపర్‌బగ్స్ అనేవి ఒక రకమైన బ్యాక్టీరియా, వైరస్‌, పరాన్నజీవులు, శిలీంధ్రాల జాతులు.. ఇవి ఇన్ఫెక్షన్లను కలిగిస్తాయి. అయితే కొన్నిసార్లు ట్రీట్మెంట్ చేయడానికి ఉపయోగించే ఇతర మందులకు కూడా లొంగని నిరోధకతను కలిగి ఉంటాయి. ఉదాహరణకు న్యుమోనియా, యూరినరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్, చర్మ వ్యాధులకు కారణమయ్యే కొన్ని సూపర్‌బగ్స్ మందులకు త్వరగా లొంగవు. అయితే వీటిని ఎదుర్కో గలిగే సరికొత్త బ్యాక్టీరియాను పరిశోధకులు కనుగొన్నారు. ఇది రోగకారక బ్యాక్టీరియాలను చంపే మరోరకమైన బ్యాక్టీరియాగా చెప్పవచ్చు.

స్లీప్ మోడ్ బ్యాక్టీరియా

సూపర్ బగ్స్ ఇన్ఫెక్షన్ల సమయంలో మానవ శరీరంలో నిద్రాణమైన స్థితిలో ఉండి ఉండవచ్చు. అయితే ఇప్పటి వరకు బ్యాక్టీరియోఫేజ్‌లను ఉపయోగించి నిద్రాణమైన బ్యాక్టీరియాను చంపే ప్రయత్నాలు సైంటిస్టులు చేసినప్పటికీ విఫలం అయ్యాయి. కానీ తాజాగా స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ బాసెల్ అండ్ ETH జ్యూరిచ్ పరిశోధకులు ఈ విషయంలో సక్సెస్ అయ్యారు.

బాక్టీరియోఫేజెస్

బాక్టీరియోఫేజెస్ అనేది ఒక కొత్త రకం బ్యాక్టీరియా యొక్క సమూహం. ఇది కొన్ని రకాల బ్యాక్టీరియాలను చంపడమే కాకుండా, వాటి సంఖ్యను గుణించడానికి సహజమైన మెకానిజంను కూడా ఉపయోగిస్తుంది. డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా లేదా ‘సూపర్‌బగ్‌లను’ చంపడానికి ఈ బాక్టీరియోఫేజ్‌లు ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు ఇప్పుడు కనుగొన్నారు.

కుళ్లిన మొక్కల్లో ప్యారైడ్స్

నిజానికి ఒక బాక్టీరిస్ పోషకాలు తక్కువగా ఉన్న వాతావరణంలో తనను తాను రక్షించుకోవడానికి, సజీవంగా ఉంటూనే స్లీప్-మోడ్‌లోకి వెళుతుంది. ఇలా నిద్రాణ స్థితిలో ఉన్నప్పటికీ బాక్టీరియాలు తమను ఇతర బ్యాక్టీరియోఫేజ్‌లు లేదా యాంటీ బయాటిక్‌ల నుంచి రక్షించుకునే మెకానిజంను డెవలప్ చేసుకుంటాయి. అయితే ప్రస్తుతం పరిశోధకులు స్విస్ స్మశాన వాటికల లోపల కుళ్లిన మొక్కల పదార్థాలలో రోగకార బ్యాక్టీరియాలు, సూపర్ బగ్‌లను చంపగలిగే బాక్టీరియోఫేజ్‌ కనుగొన్నారు. దానికి ‘ప్యారైడ్’ అని పేరు పెట్టారు.

న్యుమోనియాకు చెక్..

రీసెర్చర్స్ కొత్తగా గుర్తించిన బాక్టీరియోఫేజ్‌ న్యుమోనియాకు కారణమయ్యే బ్యాక్టీరియా అయిన పరీడ్ సూడోమోనాస్ ఎరుగినోసాను చంపుతున్నట్లు కనుగొన్నారు. యాంటీ బయాటిక్ మెరోపెనెమ్‌తో కలిపి ప్యారైడ్ 99 శాతం పి ఎరుగినోసాను (P aeruginosa) చంపగలదని పరిశోధనల ద్వారా నిర్ధారించారు. ఎలుకలపై ప్రయత్నించినప్పుడు కూడా ప్రభావవంతంగా ఉందని తెలిపారు. ఇక నుంచి సూపర్‌బగ్‌ల వల్ల తలెత్తే వ్యాధులను, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఏర్పడుతుందని రీసెర్చర్స్ అంటున్నారు.


Advertisement

Next Story

Most Viewed