- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
VOYEURISM : జపాన్‌లో సమస్యగా మారుతున్న వోయూరిజం.. అశ్లీల వీడియో తీసిన వ్యక్తి అరెస్ట్
దిశ, ఫీచర్స్: వోయూరిజం(voyeurism)అనే పదం మీరెప్పుడైనా విన్నారా? అమ్మాయిల ప్రయివేట్ పార్ట్‌లను, వారి లైంగిక చర్యలను రహస్యంగా చిత్రీకరించడం ద్వారా పైశాచికానందం పొందే పురుషుల అలవాటును ఇది సూచిస్తుంది. అప్‌స్కర్ట్ ఫొటో గ్రఫీ, చికాన్ అనే పేర్లతో విస్తరిస్తూ ప్రజెంట్ జపాన్‌లో ఒక సమస్యగా మారుతోందట. ఇటీవల క్యోటోకు చెందిన 44 ఏళ్ల వయస్సుగల లైట్ డెలివరీ ట్రక్కు డ్రైవర్ సతోషి నిషిమురాను అక్కడి పోలీసులు అరెస్టు చేశారు. రీజన్ ఏంటంటే. ఈ జపనీస్ వ్యక్తి తన ట్రక్కుకింద యువతుల స్కర్ట్ కింది భాగం వీడియో రికార్డ్ అయ్యేలా నాలుగు కెమెరాలను అమర్చడం ద్వారా వందల కొద్దీ వోయూరిస్టిక్ వీడియోలను తీశాడు.
అసభ్య చర్యలకు పాల్పడుతున్నట్లు అనుమానం వచ్చిన ఒక మహిళ ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్న అక్కడి పోలీసులు 30 హార్డ్ డ్రైవ్‌లను స్వాధీనం చేసుకున్నారు. అతను 11 ఏళ్లుగా దాదాపు వెయ్యి మంది అమ్మాయిల స్కర్ట్ కింది ప్రయివేటు భాగాన్ని అతను చిత్రీకరించినట్లు వెల్లడించారు. 2022 సెప్టెంబరు నుంచి డిసెంబరు మధ్య ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు చెందిన పలువురు విద్యార్థినులతో సహా, మరో ఎనిమిది మంది మహిళల పర్సనల్ పార్ట్‌లను కూడా రహస్యంగా వీడియో తీశాడట. ఈ సంఘటనతో అప్రమత్తమైన పోలీసులు జపాన్‌లో వోయూరిజాన్ని అరికట్టేందుకు కఠినమైన విధానాన్ని అమలు చేసే విషయమై ఆలోచిస్తున్నారు.