- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
103 ఏళ్ల వయసులో 54 ఏళ్ల మహిళను మూడో పెళ్లి చేసుకున్న తాత!
దిశ, ఫీచర్స్: ప్రస్తుత రోజుల్లో యువత.. ఉద్యోగం సంపాదించుకున్నాకే పెళ్లి చేసుకుంటున్నారు. మగవారికైతే పెళ్లి ఒక సమస్యగా మారింది. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలంటే ముందు తప్పనిసరిగా ఉద్యోగం ఉండాలి. ఏ అమ్మాయి తల్లిదండ్రులైన ముందుగా అబ్బాయికి జాబ్ ఉందా? లేదా? అని ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా అబ్బాయిలు 30-35 ఏళ్లు వచ్చేదాకా పెళ్లి చేసుకోవడం లేదు. కానీ ఓ తాత 103 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని సోషల్ మీడియాలో జనాలను ఆశ్యర్యపరుస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. ‘‘మధ్యప్రదేశ్‌కు చెందిన హబీబ్ నాజర్ అనే తాత వయసు 103 ఏళ్లు. గతంలో ఈయన రెండు వివాహాలు చేసుకున్నారు. పలు కారణాల వల్ల ఈ తాత ఒంటరిగా ఉంటున్నాడు. రీసెంట్‌గా ఇరు కుంటుంబాల సమక్షంలో హబీబ్ నాజర్ 54 ఏళ్లున్న ఫిరోజ్ జహాన్ అనే తన స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఫిరోజ్ మాట్లాడుతూ.. హబీబ్ నాజర్ వివాహం చేసుకోవడం హ్యాపీగా ఉంది. స్వాతంత్య్ర సమరయోధుడైన ఈయనను పెళ్లి చేసుకోవడం సంతోషంగా అనిపిస్తుంది అని వెల్లడించింది. ఈ వయసులో వివాహం చేసుకోవడానికి కారణం ఏంటి? అని అడగ్గా.. ‘నేను ఒంటరిగా ఉన్నానంటూ అమాయకంగా చెప్పుకొచ్చాడు నాజర్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవ్వగా.. రసికుడంటే ఈ తాతనే అంటూ కామెంట్లు పెడుతున్నారు.