Tiffins: ఎటువంటి టిఫిన్స్ లోకైనా రుచిగావుండే 4 రకాల వెరైటీ చెట్నీలు

by Anjali |   ( Updated:2024-10-02 03:19:21.0  )
Tiffins: ఎటువంటి టిఫిన్స్ లోకైనా రుచిగావుండే 4 రకాల వెరైటీ చెట్నీలు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య తప్పక టిఫిన్ చేయాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. లేకపోతే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తారు. అయితే టిఫిన్స్ లోకి ఒకే రకమైన చట్నీ కాకుండా టేస్టీ టేస్టీ నాలుగు రకాల చట్నీలు తయారు చేసుకోండి. ఇవి ఏ టిఫిన్స్ లో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

పల్లీ, పుట్నాల చట్నీ..

ముందుగా గ్యాస్ పై కడాయి పెట్టుకుని ఆయిల్ వేయండి. తర్వాత పల్లీలు, పచ్చిమిర్చి, పావు టీస్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. పల్లీలు ఎర్రగా వేగాక.. మిక్సీ జార్ లో వేసుకోండి. ఇప్పుడు దీనిలోనే ఒక పావుకప్పు పుట్నాలు, పచ్చి కొబ్బరి, రుచికి సరిపడ కొద్దిగా చింతపండు, సాల్ట్ వేసుకోండి. తర్వాత పోపు దినుసులతో పోపు వేసి.. దాన్ని ఈ గ్రాండ్ చేసుకున్న ఈ మిశ్రమంలో కలిపితే చట్నీ రెడీ.

మినపప్పు- శనగపప్పు చట్నీ..

కడాయి పెట్టాక ఒక టీస్పూన్ మినపప్పు, పచ్చి శనగపప్పు వేసి లో ఫ్లేమ్ లో పెట్టి మాడకుండా వేయించాలి. 5 నిమిషాలయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, 6 వెల్లుల్లిరెమ్మలు, చిన్న ఉల్లిపాయలు వేసి వేయించుకోండి. ఈ క్రమంలోనే సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత పుదీనా ఆకు అండ్ పచ్చి కొబ్బరి యాడ్ చేసి వేగాక.. ఇందులో కాస్త వాటర్ వేసి మిక్స్ పట్టండి. లాస్ట్ లో మిక్సీ పట్టండి. ఈ చట్నీని పక్కన పెట్టి మూడో చట్నీ చూద్దాం..

వేయించిన పల్లీ-ఎండుమిర్చి..

ఈ చట్నీ కోసం మిక్సీలో వేయించిన పల్లీలు, ఎండు మిరపకాయలు, సాల్ట్, వెల్లుల్లి వేసి మిక్సీ పట్టండి. తర్వాత పోపు ఇందులో యాడ్ చేస్తే ఈజీ టేస్టీ పల్లీ, ఎండుమిర్చి చట్నీ తయారు అయిపోయినట్లే. అందరికీ ఇష్టమైన రుచికరమైన ఈ చట్నీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.

మెంతులు-టమాటా..

కడాయిలో ఆయిల్ వేసి.. వేడయ్యాక టేబుల్ స్పూన్ మినపప్పు, కాస్త మెంతులు, ఉల్లిపాయలు, వెల్లుల్లి , జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. తర్వాత టమాటా అండ్ కొద్దిగా టేస్ట్ కోసం చింతపండు వేయండి. చింతపండు ప్లేస్ లో ఒక చిన్న అల్లం ముక్క అయినా యాడ్ చేసుకోవచ్చు. 10 నిమిషాలు అయ్యా సాల్ట్ వేసి మిక్సీ పట్టి.. పోపు పెట్టండి.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story

Most Viewed