శవాలపై బిజినెస్.. భద్రపరిచేందుకు రూ.23లక్షలు.. కారణం కూడా బాగుందే..

by Prasanna |
శవాలపై బిజినెస్.. భద్రపరిచేందుకు రూ.23లక్షలు.. కారణం కూడా బాగుందే..
X

దిశ, ఫీచర్స్: యూఎస్ మిల్వాకీకి చెందిన ఓ వ్యక్తి తాను చనిపోయిన తర్వాత తన శరీరాన్ని క్రయోజెనిక్‌గా డీప్ ఫ్రీజ్ చేయడానికి $28,000(రూ.23లక్షలు) చెల్లించేందుకు సిద్ధమయ్యాడు. తనతోపాటు తన భార్య, ముగ్గురు పిల్లల శరీరాలను భద్రపరిచేందుకు అనుమతించాడు. క్రయోనిక్స్ నిపుణుడైన డెన్నిస్ కోవల్‌స్కీ.. విస్కాన్సిన్‌లోని క్రయోనిక్స్ ఇన్‌స్టిట్యూట్‌కు అధిపతి. కాగా ఇక్కడ చనిపోయిన తర్వాత వ్యక్తుల శరీరాలను భద్రపరుస్తారు. ఇన్‌స్టిట్యూట్‌లో ప్రస్తుతం 200 మందికి పైగా క్రియోస్టాసిస్ పేషెంట్స్ ఉండగా.. తాను కూడా ఇందుకు ఓకే చెప్తూ, దీని వెనుకగల కారణాన్ని వివరించాడు.

‘మరణించిన తర్వాత శరీరాన్ని పూర్తిగా డీఫ్రీజ్ చేయడం మంచిది. భవిష్యత్తులో పునరుజ్జీవనం పొందే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో భవిష్యత్ పురోగతి ఈ సంరక్షించబడిన జీవుల పునరుద్ధరణను ఎనేబుల్ చేస్తుందనే ఆశ ఉంది. క్రయోజెనిక్ ఉష్ణోగ్రతల వద్ద శరీరాలను భద్రపరిచే అభ్యాసం, వైద్య సంఘంచే గుర్తించబడనప్పటికీ ప్రజాదరణ పొందింది. చనిపోయిన తర్వాత కొద్ది సంవత్సరాలకు తిరిగి జీవం పోసుకునే అవకాశం కోసం రూ. 23 లక్షలు ఖర్చు చేయలేరా?!’ అని ప్రశ్నిస్తున్నాడు డెన్నిస్. ఈ విధంగా భూమిపై మళ్లీ ఊపిరిపోసుకునే చాన్స్ ఉందని జనాల్లో ఆశలు పెంచుతూ, బిజినెస్ కూడా బాగానే వర్కవుట్ చేస్తున్నాడు.

క్రయోజెనిక్ పద్ధతి

క్రయోనిక్స్ సబ్జెక్ట్(ఈ పద్ధతికి సైన్ చేసిన వ్యక్తి) మరణించిన తరువాత.. బృందం వెంటనే సంరక్షణ ప్రక్రియలను ప్రారంభిస్తుంది. మొదటి దశలో శరీర ఉష్ణోగ్రతను 50°F మరియు 32°F (10°C మరియు 0°C) మధ్య చల్లబరచడం.. రక్తప్రసరణ, శ్వాసక్రియను యాంత్రికంగా పునరుద్ధరించడం చేస్తారు. రెండవ దశలో సబ్జెక్ట్ రక్తం కడిగివేయబడుతుంది. శరీరంలోని చాలా నీరు క్రయోప్రొటెక్టెంట్‌తో భర్తీ చేయబడుతుంది(ఒక విధమైన హ్యూమన్ యాంటీఫ్రీజ్). సబ్జెక్ట్ అప్పుడు -184°F (−120°C)కి దగ్గరగా ఉండే ఉష్ణోగ్రతకు చల్లబడుతుంది. వాటిని పునరుజ్జీవింపజేసే సమయం వచ్చేవరకు క్రయోస్టాసిస్‌లో ఉంచబడుతుంది. అది జరిగితే సబ్జెక్ట్ రివార్డ్ చేయబడుతుంది. వారి శరీరం నుంచి క్రయోప్రొటెక్టెంట్ తొలగించబడుతుంది. వారి కణజాలాలు బాగు చేయబడతాయి. వ్యాధులు నయమవుతాయి. సబ్జెక్ట్ మళ్లీ జీవిస్తుంది.

Advertisement

Next Story

Most Viewed