50 ఇంటర్వ్యూల తర్వాత.. కోటి రూపాయల జాబ్

by Disha News Desk |
50 ఇంటర్వ్యూల తర్వాత.. కోటి రూపాయల జాబ్
X

దిశ, ఫీచర్స్ : కొందరు చదువు అయిపోయిన తొలి ప్రయత్నాల్లోనే ఉద్యోగం సాధిస్తారు. కానీ చాలామంది తమ డ్రీమ్ జాబ్ కోసం ఏళ్ల తరబడి కష్టపడుతుంటారు. ఈ క్రమంలో పలకరించే అపజయాలతో ఒత్తిడికి లోనవుతుంటారు. అయితే అలుముకునే నిరుత్సాహాన్ని పక్కనబెట్టి, ఒక్కో దశలో బయపటడ్డ బలహీనతలపై ఫోకస్ చేస్తే తప్పకుండా విజయం దక్కుతుంది. 24 ఏళ్ల సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సంప్రీతి యాదవ్‌‌ది కూడా ఇదే స్టోరీ. తాను కలగన్న ఉద్యోగం కోసం సుదీర్ఘకాలం కఠిన పరిస్థితులు ఎదుర్కొన్న ఆమె 50 ఇంటర్వ్యూల తర్వాత చివరకు గూగుల్‌ కంపెనీలో రూ. 1.10 కోట్ల సాలరీతో ఉద్యోగం పొందింది. ఆ అనుభవాలు తన మాటల్లోనే..

ప్రయాణమే కీలకం..

'ఇంటర్వ్యూస్ ఫేస్ చేసే క్రమంలో నేను భయాందోళనకు గురయ్యాను. తల్లిదండ్రులు, సన్నిహితులు వెన్నుతట్టి ప్రోత్సహించారు. కానీ చాలాసార్లు తడబడ్డాను. ఈ క్రమంలోనే పెద్ద కంపెనీల గురించి స్టడీ చేసేందుకు గంటల సమయం వెచ్చించాను. సాధారణంగా ఇలాంటి కంపెనీల్లో ఇంటర్వ్యూలన్నీ డిస్కషన్స్ మాదిరిగా ఉంటాయి. దీంతో ఆయా టాపిక్స్‌పై ప్రాక్టీస్ ఎక్కువగా చేయడం వల్లే నెర్వస్‌నెస్‌ను అధిగమించి, కాన్ఫిడెంట్‌గా ఇంటర్వ్యూ పూర్తిచేయగలిగాను' అని యాదవ్ చెప్పింది. ఇక కోటి రూపాయల శాలరీ ప్యాకేజీ అంటే కోట్లాది మంది భారతీయుల కల. ఇందుకు సంప్రీతి కూడా మినహాయింపు కాదు గానీ తనకు ప్యాకేజ్ కంటే గూగుల్ లండన్‌లో ప్లేస్‌మెంట్ సాధించడమే ఎక్కువ ఇంపార్టెంట్ అని ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ నుంచి బీటెక్ పూర్తి చేసిన యాదవ్ తెలిపింది.


ప్రేరణకు మూలం..

సంప్రీతి తన తల్లిదండ్రుల నుంచే ప్రేరణ పొందినట్లు చెప్పింది. ప్రస్తుతం ఆమె తండ్రి రామ్ శంకర్ యాదవ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తుండగా.. తల్లి శశిప్రభ బీహార్‌లోని ప్లానింగ్ అండ్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇక నేటి యంగ్ జనరేషన్ వలె సోషల్ మీడియాను ఆస్వాదించే సంప్రీతి.. ఆ వాడకం టాక్సిక్ కాకుండా చూసుకోవాలని చెబుతోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్స్ ఉన్నప్పటికీ లింక్డ్‌ఇన్‌లోనే ఎక్కువ సమయం గడుపుతానని చెప్తోంది. ఇక తనలా పెద్ద పెద్ద లక్ష్యాల కోసం కృషి చేసే యువతకు.. కెరీర్ లక్ష్యాలను నిదానంగా, ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని సూచిస్తోంది.

Advertisement

Next Story

Most Viewed