- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రోడ్లపై ఏరులై పారిన 20 లక్షల లీటర్ల రెడ్ వైన్...
దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా భారీ వర్షాలు సంభవించినప్పుడు వరదలు రావడం కామన్. కానీ, ఏకంగా రెడ్ వైన్ రోడ్లపై ఏరులై పారితే.. అలాంటి అరుదైన ఘటన పోర్చుగల్ లోని సావో లౌరెన్కో డి బైరో నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పట్టణం శివారులోని లెవిరా డిస్టిలరీ అనే అల్కాహాలు కంపెనీ ఉంది. ఈ క్రమంలోనే 20 లక్షల లీటర్ల రెడ్ వైన్ బ్యారెల్ ను ఆర్డర్ మీద పరిశ్రమ నుంచి మరోచోటికి తరలిస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యారెల్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది.
దీంతో రెడ్ వైన్ అంతా సమీపంలో ఉన్న వీధుల్లో ఏరులై పారింది. దీంతో స్థానికులంతా వైన్ ప్రవాహాన్ని చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు రెడ్ వైన్ ను స్థానిక నదిలో కలవకుండా మరో ప్రాంతానికి వరదను మళ్లించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై వైన్ కంపెనీ లెవిరా డిస్టిలరీ క్షమాపణలు చెప్పింది. నష్టానికి అయ్యే ఖర్చులన్నింటికీ తామే బాధ్యత వహిస్తామని, విధులన్నీ తామే క్లీన్ చేస్తామంటూ ట్విట్టర్ వేదికగా తెలిపింది.