Intelligent animals: మనుషులకంటే తెలివిగా ప్రవర్తించే 10 అరుదైన జంతువులివే?

by Anjali |   ( Updated:2024-09-29 08:42:13.0  )
Intelligent animals: మనుషులకంటే తెలివిగా ప్రవర్తించే 10 అరుదైన జంతువులివే?
X

దిశ, వెబ్‌డెస్క్: మనుషులు మాత్రమే అన్ని విషయాల్లో తెలివైనవారు అని భావిస్తారు. కానీ మనుషుల కంటే తెలివిగా ప్రవర్తించే పది జంతువులు కూడా ఉన్నాయని తాజాగా పరిశోధనలో తేలింది. మనుషులు కూడా అప్పుడప్పుడు జంతువుల తెలివితేటలను కళ్లకు కట్టినట్లు చూస్తారు. అవి చేసే పనులకు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇక కొన్ని జంతువులు అయితే ఊహకందని విధంగా తెలివితేటలకు ప్రదర్శిస్తాయి. ఒక ప్రాబ్లమ్ వస్తే వాటికవే సాల్వ్ చేసుకుంటాయి. ముఖ్యంగా జంతువులు ప్రమాదాలను ఫస్టే గుర్తిస్తాయి. పైగా జంతువుల్లోని కమ్యూనికేషన్ ను చూస్తే తెగ ముచ్చటేస్తుంది. అయితే ఇలాంటి తెలివిగల అరుదైన జంతువులు జంతువులు 10 ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

విశ్వానికి నిదర్శనంగా చెప్పుకునే కుక్కలు చాలా తెలివిగా ప్రవర్తిస్తాయి. భావోద్వేగాలను వ్యక్తపర్చడంలో కుక్కలకు సాటి మరో జంతువులు ఉండవనుకోండి. ఏ ప్రమాదకరమై విషయాన్ని అయినా ముందుగానే కనిపెడతాయి. అలాగే మిలటరీ, పోలీసు, స్క్వాడ్ డిపార్ట్‌మెంట్లలో కుక్కలను ఉపయోగిస్తారు. తెలివైన జంతువుల్లో చింపాంజీలు ఒకటి. ఇవి ఆహారం సంపాదించుకోవడానికి ప్రత్యేక సాధనాలు(సుత్తి, చాకులు)వాడుతాయి. ఇక పక్షుల్లో కాకులు కూడా చాలా తెలివైనవి.

అరుపులతో వీటి కమ్యూనికేట్ అవుతాయి. కాకులు గ్రూపులుగా బతుకుతాయి. సముద్రంలో ఉండే డాల్ఫిన్లు అత్యంత తెలివిగలవి. పలు దేశాల్లో డాల్ఫిన్లకు శిక్షణ ఇచ్చి సముద్రంలో అంతుచిక్కని విషయాల గురించి పరిశోధనలు చేస్తుంటారు. మనుషుల్లాగే ప్రేమ, ఆప్యాయతలు చూపే ఏనుగు కు చాలా మెమొరీ పవర్ ఉంటుంది. కుటుంబ బాధ్యతలు, జీవించే విధానం, పిల్లల పెంపకం లాంటివి చక్కగా చేస్తుంటాయి. ఇక శత్రువులకు చేజిక్కకుండా ఉండటంలో ఆక్టోపస్ కు ఏ జంతువు సాటి కాదు.

కోతి జాతికి చెందిన ఓరంగుటాన్ లు వేట సమయంలో చాకచక్యంగా వ్యవహరిస్తాయి. అలాగే అందరికీ ఇష్టమైన చిలుక.. ఇది మనుషులు చెప్పే విషయాల్ని కూడా అర్థం చేసుకుంటుంది. అందరూ అసహ్యించుకునే పందులకు కూడా అద్భుతమైన తెలివి ఉంటుంది. అలాగే తెలివితో పాటు ఎక్కువకాలం జీవించే జంతువు రావెన్ ఒకటి. ఇవి మనుషుల్లాగానే ఫ్యూచర్ గురించి ఒక ప్రణాళిక వేసుకుంటాయి. రావెన్ 23 ఏళ్లు జీవిస్తుంది.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story