ఫ్రస్టేటెడ్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఎఫ్‌ 3’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్

by Shyam |
ఫ్రస్టేటెడ్ ఫ్యాన్స్‌కు పండగే.. ‘ఎఫ్‌ 3’ రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్
X

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ స్టోరీ లైన్‌తో బాక్సాఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేసిన చిత్రానికి ‘ఎఫ్‌ 3’ పేరుతో సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఫస్ట్ పార్ట్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ‘ఎఫ్‌2’కు మించిన ఎంటర్‌టైన్‌మెంట్‌ పక్కా అని గతంలోనే హామీఇచ్చాడు. ఇక క్రో బ్రదర్స్‌ వెంకీ, వరుణ్ మరోసారి తమ కామెడీ టైమింగ్‌ను తెలుగు ఆడియన్స్‌కు రుచి చూపేందుకు సిద్ధమైపోయారు. ఈ నేపథ్యంలోనే ‘ఎఫ్‌ 3’ చిత్రీకరణ తుది దశకు చేరుకున్నట్లు తెలిపిన చిత్రబృందం.. రిలీజ్ డేట్‌‌ను అధికారికంగా ప్రకటించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 25న థియేట్రికల్ రిలీజ్ ప్లాన్ చేసినట్లు స్పష్టం చేశారు.

ఫుల్‌ లెంగ్త్ కామెడీ కమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తుండగా.. బ్యూటిఫుల్ పెయిర్ తమన్నా, మెహ్రీన్‌ హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఇక ‘ఎఫ్ 2’కు మ్యూజిక్ అందించిన రాక్‌స్టార్ దేవిశ్రీనే సీక్వెల్‌కు కూడా స్వరాలు సమకూర్చారు.

https://twitter.com/SVC_official/status/1452147238730305537?s=20

Advertisement

Next Story

Most Viewed