ప్రతి ఆరుగురిలో ఒకరికి ఉందట!

by sudharani |
ప్రతి ఆరుగురిలో ఒకరికి ఉందట!
X

దిశ, వెబ్‌డెస్క్:
కొవిడ్ 19 పాజిటివ్ కేసులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసేందుకు వీలుగా కేంద్రం ప్రభుత్వం ఆరోగ్యసేతు యాప్‌ను ఆవిష్కరించింది. ప్రతి ఒక్కరూ దీన్ని కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని సూచనలు కూడా చేసింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తప్పనిసరి అని ఆదేశాలు జారీ చేసింది. దీంతో 83.5 మిలియన్ల డౌన్‌లోడ్‌లు సాధ్యమయ్యాయి. కానీ కరోనా పాజిటివ్ అని తేలిన వారు మాత్రం ఈ యాప్ ఇన్‌స్టల్ చేసుకోవడం లేదట. దాదాపు 37000 పాజిటివ్ కేసులు ఉండగా వీరిలో 6250 మంది మాత్రమే ఆరోగ్యసేతు వాడుతున్నారట. అంటే ప్రతి ఆరుగురు పాజిటివ్ కేసుల్లో ఒక్కరు మాత్రమే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసినట్లు.

యాప్‌లో లభ్యమైన డేటా ప్రకారం, వ్యాధి ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 24 జిల్లాల్లోని ప్రధాన క్లస్టర్లలో 15 మిలియన్ డౌన్‌లోడ్లు అయ్యాయి. మొత్తం యూజర్ బేస్‌లో ఇది 18 శాతం. 2011 జనాభా లెక్కల ప్రకారం ఈ జిల్లాల్లో జనాభా దాదాపు 88 మిలియన్లు ఉంటుంది. ఈ లెక్కన చూస్తే యాప్ ఇన్‌స్టాలేషన్లు తక్కువ అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఎక్కువ యూజర్లు ఢిల్లీ (4 మిలియన్లు), పూణే (1.5 మిలియన్లు), ముంబై (2 మిలియన్లు)లలో ఎక్కువగా ఉన్నారు.

అలాగే ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వారిలో 3 మిలియన్ల మందికి కొవిడ్ లక్షణాలు ఉన్నట్లు తేలింది. వీరిలో దాదాపు 30వేల మందిని దగ్గరి నుంచి పరీక్షించాల్సిన అవసరం ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరూ ఈ యాప్ కచ్చితంగా ఇన్‌స్టాల్ చేసుకోవాలని యాప్ డెవలపర్ లలితేష్ కాట్రగడ్డ చెబుతున్నారు.

Tags: corona, covid, aarogya setu, corona positive, app, install, india, statistics

Advertisement

Next Story

Most Viewed