- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బెయిల్‌పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకెళ్తారు..
దిశ, ఏపీ బ్యూరో: వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు బీజేపీ నిర్వహించిన ప్రజాగ్రహ సభ కమల నాధులతో కిక్కిరిసిపోయింది. ఈ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ హాజరయ్యారు. ఈ సభలో ప్రకాశ్ జవదేకర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించాయి. రాష్ట్రంలో చాలామంది నేతలు బెయిల్‌పై బయట ఉన్నారని జవదేకర్ వ్యాఖ్యానించారు. బెయిల్ పై ఉన్న నేతలు త్వరలోనే జైలుకు వెళతారంటూ బాంబు పేల్చారు. రాష్ట్రంలో మద్య నిషేధం అని చెప్పి, ఇప్పుడు మద్యంపై వచ్చే డబ్బుతోనే పరిపాలన సాగిస్తున్నారని విమర్శించారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ, టీడీపీ, టీఆర్ఎస్.. ఈ మూడు పార్టీలు కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఈ మూడు ప్రాంతీయ పార్టీలది అవినీతి పాలనే అని ధ్వజమెత్తారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో పోలవరానికి అన్ని అనుమతులు ఇచ్చినట్లు చెప్పుకొచ్చారు. అనుమతులు ఇచ్చి ఏడేళ్లైనా నేటికి పోలవరం పూర్తి చేయలేకపోవడంపై మండిపడ్డారు. అమరావతి కోసం అటవీ భూములను బదిలీ చేసినట్లు చెప్పుకొచ్చారు. తాను కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఏపీలో కొన్ని సమస్యలు గుర్తించినట్లు చెప్పుకొచ్చారు. రాజధాని విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ నెలకొందన్న ప్రకాశ్ జవదేకర్ ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేశాయని ఆరోపించారు.
ఇకపోతే అయోధ్యలో గొప్పగా రామాలయం నిర్మిస్తున్నామని ప్రకాశ్ జవదేకర్ తెలిపారు. వారణాసి, చార్ ధామ్ వంటి పుణ్యక్షేత్రాల రూపురేఖలు మారుస్తున్నామని పేర్కొన్నారు. ఏపీలో పరిస్థితి బాగా లేదని, అంతర్వేదిలో రథం దగ్ధమైందని, రామతీర్థంలో స్వామివారి విగ్రహాన్ని విరగ్గొట్టారని మండిపడ్డారు. ఇకపోతే ప్రకాశ్ జవదేకర్ ఆంగ్లంలో ప్రసంగించగా.. పురంధేశ్వరి తెలుగులో అనువదించారు. ఇకపోతే జైలుపై బయట ఉన్న నేతలు త్వరలోనే జైలుకెళ్తారంటూ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. సీఎం జగన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారా? లేక ఇంకెవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారనే దానిపై పొలిటికల్ సర్కిల్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
- Tags
- bjp party