- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TRS ఎమ్మెల్యే అండతో రెచ్చిపోతున్న నేతలు.. మహిళల జీవితాలతో చెలగాటం..
దిశ, మణుగూరు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజక వర్గ శాసనసభ సభ్యులు, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తుంటే ఆ నలుగురు ఆయన పరువు తీస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో రేగా శ్రామిస్తుంటే ఆ నలుగురు నియోజకవర్గానికి తలవంపులుగా తయారై టీఆర్ఎస్, రేగా పరువును బజారుకీడుస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతోంది.
ఎమ్మెల్యే రేగా పేరు చెప్పుకుంటూ నియోజకవర్గంపై పడి దోచుకుంటున్నారని ప్రజల ద్వారా తెలుస్తోంది. ఆ నలుగురు ముఖ్యంగా అశ్వాపురం, మణుగూరు, బయ్యారం, పినపాక, తదితర ప్రాంతాలలో భూ కబ్జాలకు పాల్పడుతూ ప్రజల ఆర్ధిక నాడిని దెబ్బతిస్తున్నారని పలువురు నాయకుల ద్వారా తేటతెల్లమవుతోంది. ఎక్కడ భూమి ఖాళీగా ఉందో తెలుసుకొని అమాయకమైన గిరిజనులను అడ్డం పెట్టుకొని వారిని ఆ భూములపైకి ఉసిగోల్పుతున్నారు. నిజానికి భూమి కొనుకున్న పేదవాడు, పదవీ విరమణ పొందిన ఉద్యోగస్తులు రెక్కలు ముక్కలు చేసుకొని ఆ భూమిని సాగుచేసుకోవడమో లేక కొత్త ఇల్లు నిర్మించుకొని కుటుంబంతో సంతోషంగా బ్రతుకుతుంటే.. ఆ నలుగురు మాత్రం గిరిజనుల పేరుతో పక్కాగా ప్లాన్ వేసి ఆ భూములను లాక్కునేందుకు ప్లాన్ చేస్తున్నారు. మండలంలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
ఆ నలుగురు నిత్యం ఎమ్మెల్యే రేగా పేరు చెప్పుకుంటూ భూకబ్జాలకు, దందాలకు పాల్పడుతున్నారని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆ నలుగురు పార్టీ పేరుతో అధికారులను, ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వారు ఎందుకు ఈ దందాలకు పాల్పడుతున్నారు.. ఈ దందాల వెనుక ఎవరి హస్తం ఉన్నది.? అనేది ఇప్పుడు మండలంలో చర్చనీయాంశంగా మారింది.
ఈ దందాలకు పాల్పడుతున్న ఆ నలుగురి గురించి ప్రజలు నిత్యం ఫోన్ల ద్వారా అధికారులకు సమాచారం తెలుపుతున్నా ఎందుకు వీరిపై చర్యలు చేపట్టడంలేదనే అనుమానం ప్రజల్లో మొదలైయింది. వీరు ప్రతీ అధికారిని భయపెడుతూ, బెదిరిస్తూ భూకబ్జాలకు, దందాలకు పాల్పడుతున్నారని మండలంలో టాక్ వినిస్తోంది. ఆ నలుగురికి ఏ అధికారి సహకరించరో ఆ అధికారి గురించి ఎమ్మెల్యే రేగాకు చెడుగా చెప్పి ఆ అధికారిని ట్రాన్స్‌ఫర్లు చేపిస్తున్నారనే విషయం ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్‌గా మారింది. మరి దీని వెనుక ఎవరున్నారు.. ఎవరు నడిపిస్తున్నారు.? వీరిపై ఎందుకు చర్యలు లేవు.. ఎమ్మెల్యే రేగా పరువు తీయడానికి వీరు ఏమైనా కంకణం కట్టుకున్నారా.? అనేది మండలంలో ముఖ్య చర్చనీయాంశంగా మారింది.
వీరి వల్ల మండలంలో ఎంతో మంది ప్రజలు ఇబ్బందులు పడ్డారని, బాధలు తట్టుకోలేక కొంత మంది సూసైడ్ చేసుకొని చనిపోయిన విషయాలు మండలంలో వెలుగులోకి వస్తున్నాయి. మండలంలో నివసించే అందమైన మహిళలపై కన్ను పడితే ఆ నలుగురు అధికార బలంతోనో లేక బెదిరించో ఆ మహిళలను పాడు చేస్తున్నారని ప్రజలు ముక్తకంఠంతో తెలుపుతున్నారు. ఈ నలుగురి వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయనే ఆరోపణలు సైతం లేకపోలేదు. ఇన్ని జరుగుతున్నా ఎమ్మెల్యే రేగా ఎందుకు మౌనంగా ఉన్నారనే విషయమే ఎవరికీ అర్థం కాకుండా మారింది.
ఈ నలుగురిని రేగా పార్టీ నుంచి బహిష్కరించకపోతే రాజకీయ భవిష్యత్ దెబ్బతినే అవకాశం ఉందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. నియోజకవర్గంలో రేగాపై మంచి పేరు, అభిమానం, ఆప్యాయత, దమ్మున్నలీడర్‌గా పేరు ఉంది. ఇప్పటికైనా ఎమ్మెల్యే రేగా ఈ నలుగురి గురించి తెలుసుకొని వీరు చేసే అక్రమాలు, భూ దందాలు, ఇసుక మాఫియాలకు అడ్డుకట్టవేయకపోతే పార్టీ పరువు, రేగా మనుగడకే ప్రమాదం ఉందని ప్రజలు గుస గుసలాడుతున్నారు. ఆ నలుగురిని వెంటనే పార్టీ నుంచి బహిష్కరించకపోతే ఎంతో నష్టం వాటిల్లుతోందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మరి రేగా వారిపై ఏ విధమైన చర్యలు చేపట్టుతారో వేచి చూడాల్సిందే.