టీఆర్ఎస్ ప్రభుత్వంలో రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి: మల్లేశం

by Sridhar Babu |   ( Updated:2021-12-23 01:59:34.0  )
Laxmipuram-1
X

దిశ, పరకాల: తెలంగాణ రాష్ట్ర సమితి అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయని లక్ష్మీపురం గ్రామ సర్పంచ్ మల్లేశం గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. హనుమకొండ జిల్లా పరకాల మండలం లక్ష్మీపురం గ్రామంలో పల్లె బోయిన సురేష్ అనే రైతు ఆత్మహత్య చేసుకొని మృతిచెందగా వారి కుటుంబ సభ్యులను గురువారం గ్రామ సర్పంచ్ ఆముదాలపల్లి మల్లేశం గౌడ్ పరామర్శించారు. ఈ సందర్భంగా మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాల మూలంగానే ఆత్మహత్యలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరి ధాన్యం కొనుగోలు చేయడంలో జాప్యం చేసినందుకుగాను కల్లాలోనే రైతులు మరణిస్తున్న ఘటనలు మరవకముందే ఇప్పుడు మిర్చి రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన రైతుల కుటుంబాలకు రైతు బీమాతో సంబంధం లేకుండా మరో పది లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. వైయస్ షర్మిల అధికారంలోకి వస్తే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం మాదిరిగా రైతు సంక్షేమం ఏర్పడుతుందన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా రైతులు ఆత్మహత్యలకు పాల్పడవద్దని ఈ సందర్భంగా సూచించారు.

Advertisement

Next Story

Most Viewed