న్యాయవాది కుటుంబాన్ని కబళించిన కరోనా..

by srinivas |
corona
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీలో కరోనా కేసులు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా కరోనా మహమ్మారి బారిన పడి న్యాయవాది కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. విజయవాడలోని పాతబస్తీకి చెందిన న్యాయవాది తునుగుంట్ల దినేష్ కరోనా సోకి మరణించాడు.

ఇవాళ ఉదయం దినేష్ తండ్రి కూడా వైరస్ బారిన పడి చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మూడు రోజుల కిందట ఇదే కరోనా మహమ్మారి బారిన పడి దినేష్ తల్లి, బాబాయ్ మృతి చెందినట్లు సమాచారం. సెకండ్ వేవ్ ధాటికి ఒకే కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాదచాయలు నెలకొన్నాయి.

Advertisement

Next Story