నెగెటివిటీ వదిలేయండి : లావణ్య

by Shyam |
నెగెటివిటీ వదిలేయండి : లావణ్య
X

సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి.. సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్న వారికి చెంప చెల్లుమనే సమాధానం ఇచ్చింది. ఇలాంటి సభ్యత లేని మెసేజ్‌లు పెడుతున్న వారందరూ లైఫ్‌లో చాలా ఫ్రస్ట్రేషన్ ఎదుర్కొంటున్న వారే అని తెలిపింది. లైఫ్‌లో హ్యాపీగా ఉన్న వారు ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయరని చెప్తోన్న లావణ్య.. సోషల్ మీడియా అనేది విషపూరితంగా మారిపోయిందని, బ్రైటర్ సైడ్ మాత్రమే చూడాలనుకుంటున్నాని తెలిపింది. తనను ప్రేమిస్తున్న వారందరికీ ధన్యవాదాలు తెలిపిన ఈ అందాల రాక్షసి.. నెగెటివ్‌గా మాట్లాడుతూ, నెగెటివ్ ఆలోచనలతో ఉన్న వ్యక్తి ఎప్పుడూ ఆనందంగా ఉండలేడని చెప్పింది. వారికి ఎలాంటి మంచి కూడా జరగదని, ఒక్కసారి ఆ నెగెటివ్ మైండ్ నుంచి బయటకొస్తే అంతా మంచే జరుగుతుందని అంటోంది.

కాగా ఈ మధ్య హీరోయిన్లకు సోషల్ మీడియాలో నెగెటివ్ కామెంట్స్ ఎక్కువ అయ్యాయి. మీరా చోప్రా కూడా అసభ్యకరమైన మెసేజ్‌లతో ఇబ్బందిపడిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed