ఇంత మంది ఆంటీల్లో ఈ బుడ్డోడు ఆమెను ఎలా క‌నుక్కున్నాడు..?! చూడండి

by Sumithra |   ( Updated:2023-08-18 15:20:11.0  )
ఇంత మంది ఆంటీల్లో ఈ బుడ్డోడు ఆమెను ఎలా క‌నుక్కున్నాడు..?! చూడండి
X

దిశ‌, వెబ్‌డెస్క్ః త‌ల్లీ బిడ్డ‌ల అనుబంధం మాటల్లోనే కాదు, ఏ విధంగానూ వ‌ర్ణించ‌లేము. కేవ‌లం, ఆ సంద‌ర్భాన్ని, ఘ‌ట‌న‌ను చూస్తే త‌ప్ప అది అర్థంకాదు. త‌ల్లి త‌న బిడ్డ ఉనికిని ఎలా ప‌సిగ‌ట్ట గ‌ల‌దో, బిడ్డలు కూడా త‌ల్లి తీరును అంతే క‌చ్ఛితంగా గుర్తించ‌గ‌ల‌రు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో దీనికి గొప్ప ఉదాహ‌ర‌ణ‌. ఓ ఏడాది వ‌య‌సున్న పిల్లాడు త‌న త‌ల్లిని గుర్తించే వీడియో ఇది. ఓకే రంగు చీరలు ధరించి, ముసుగేసుకొని, వ‌రుస‌గా కూర్చున్న మహిళల్లో తన త‌ల్లి ఎవ‌రో బిడ్డ భ‌లే గుర్తిస్తాడు.

దాదాపు 18 మిలియన్ల వ్యూవ్స్ ఉన్న ఈ వీడియోకు నెటిజన్లు హృద‌యాలు చ‌లిస్తున్నాయి. ప్రేమ‌కు మాట‌లతో ప‌నిలేదంటూ నెటిజన్లు క్యూట్ కామెంట్స్ చేస్తున్నారు. "మా కి ఖుష్బూ అలాగ్ హాయ్ హోతీ హై (తల్లులకు ప్రత్యేకమైన సువాసన ఉంటుంది)" అని మురిసిపోతున్నారు.

Advertisement

Next Story

Most Viewed