తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయోగం.. పంట కాలం ముందుకు జరిపే యోచన !

by Seetharam |
తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయోగం.. పంట కాలం ముందుకు జరిపే యోచన !
X

దిశ,వెబ్‌డెస్క్: వ్యవసాయ రంగంలో తెలంగాణ ప్రభుత్వం కొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమవుతోంది. ఒరి పంటకాలాన్ని ఒక నెల ముందుకు జరిపేందుకు కసరత్తు చేస్తోంది. గాలి వానలు, అకాల వర్షాల నుంచి రైతులను నష్టాల పాలు కాకుండా కాపాడేందుకు ప్రయత్నం చేస్తోంది. దీనికోసం సచివాలయంలో వ్యవసాయంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించింది. ఇటీవల అకాల వర్షాలతో బాగా నష్టపోయిన వరి రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రబీ సీజన్ పంటకాలాన్ని మార్చిలోపు ముగించాలనే ఆలోచనలో కేసీఆర్ ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆదేశించారు.

Advertisement

Next Story