H3N2 వైరస్ ఎక్కువ ముప్పు ఇలాంటి వారికే!

by Shiva |   ( Updated:2023-03-14 14:01:39.0  )
H3N2 వైరస్ ఎక్కువ ముప్పు ఇలాంటి వారికే!
X

దిశ, వెబ్ డెస్క్: 2009లో వచ్చిన స్వైన్‌ఫ్లూ (హెచ్‌1ఎన్‌1) ను పోలిన ఇన్‌ఫ్లూయెంజా1 రూపాంతరం చెంది హెచ్‌3ఎన్‌2గా అవతరించి, ఇటీవలి కాలంలో వ్యాప్తి చెందుతోంది. అన్ని ఫ్లూ వైర్‌సలనె పోలిన ప్రాథమిక లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు తీవ్రంగా ఉండడం, వేగంగా వ్యాప్తి చెందుతూ ఉంది కాబట్టి దీని పట్ల అప్రమత్తత అవసరం. కొవిడ్‌ను పోలిన ప్రవర్తనతో విస్తరిస్తున్న ఈ వైరస్‌ రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, శ్వాస సంబంధ వ్యాధులున్న వారికి కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది.

ఈ వ్యాధి సోకిన వారిలో లక్షణాలు దగ్గు, జ్వరం, గొంతు నొప్పి, చలి, ముక్కు కారడం, దిబ్బెడ, తలనొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట, వికారం, వాంతులు, విరోచనాలు, కొంతమందిలో ఫిట్స్‌, ఆయాసం, ఛాతీ నొప్పి, బ్రాంఖైటిస్‌, న్యుమోనియా, చెవి సమస్యలు వస్తాయి. 15ఏళ్లు లోపు మరీ ముఖ్యంగా ఐదేళ్ల లోపు పిల్లలు, 65 ఏళ్లు పైబడిన పెద్దలు, గర్భిణులు, దీర్ఘకాలిక రోగులు, కీమో, రేడియోథెరపీ తీసుకుంటున్న కేన్సర్‌ రోగులు, డయాలసిస్‌ చేయించుకున్న వారు, ఎయిడ్స్‌ రోగులు, ఇమ్యూనిటీ తగ్గినవారు వ్యాధి బారిన పడే ప్రమాదం ఉంటుంది.

చికిత్స ఇలా..!

ఐదు నుంచి వారంలో రోజుల్లో సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఫ్లూ లక్షణాలు వాటంతట అవే తగ్గిపోతాయి. చికిత్స తీసుకోవాలనుకున్నవారు వైద్యులు సూచించిన యాంటీవైరల్‌ కోర్సు పూర్తి చేసుకోవాలి. ప్రతి ఫ్లూ జ్వరానికీ యాంటీ బయాటిక్స్‌ వాడుకోకుండా, బ్యాక్టీరియా వల్ల సెకండరీ ఇన్‌ఫెక్షన్‌ వచ్చిన సందర్భంలో, వైద్యుల సూచన మేరకే మందులు వాడుకోవాలి. విశ్రాంతి తీసుకుంటూ, ఆహార నియమాలు పాటిస్తే, త్వరగా కోలుకోవచ్చు.

Also Read..

గుండె దడ స్టార్టయిందా.. హాలిడే హార్ట్ సిండ్రోమ్ కావచ్చు

Advertisement

Next Story

Most Viewed