- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మందుబాబులకు షాకింగ్ న్యూస్.. ఆదివారం సుక్క, ముక్క బంద్

దిశ, వెబ్ డెస్క్: వీకెండ్ వచ్చిందంటే.. చాలా మంది మందు, విందుతో ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వారికి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే.. ఈ ఆదివారం(రేపు) మద్యం, మాంసం దుకాణాలు మూతపడనున్నాయి. తిరిగి సోమవారం ఉదయం తెరుచుకోనున్నాయి. జనవరి 26న 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వైన్ షాపులు, మాంసం విక్రయించే దుకాణాలు బంద్ చేయాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి.
అంతేకాదు, ఈరోజు రాత్రి నుంచే జంతువులను వధించకూడదని సూచించాయి. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. అన్నీ పట్టణాల్లో కూడా ఇవే తరహా ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో మద్యం ప్రియులు శనివారం నుంచే షాపుల ముందు క్యూ కట్టారు. ముందుగానే తమకు కావాల్సిన మద్యం బాటిళ్లను కొనుగోలు చేసుకుని ఇంటికి తెచ్చుకుంటున్నారు. సాధారణంగా జాతీయ పర్వదినాలైన జనవరి 26, ఆగష్టు 15, గాంధీ జయంతి వంటి దేశానికి సంబంధించిన ప్రత్యేకమైన రోజుల్లో ప్రభుత్వం మద్యం, మాంసం విక్రయాలను బంద్ చేస్తుంది.