Aaradhya Bachchan : హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు..!

by Shiva |   ( Updated:2023-04-24 07:17:09.0  )
Aaradhya Bachchan : హైకోర్టును ఆశ్రయించిన అమితాబ్ మనవరాలు..!
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌ సూపర్ స్టార్ అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌, ఐశ్వర్యారాయ్‌ కూతురు ఆరాధ్య బచ్చన్‌ హైకోర్టును ఆశ్రయించింది. కొన్ని యూట్యూబ్‌ ఛానళ్లు తమ రేటింగ్స్ కోసం తన ఆరోగ్యంపై వదంతులు సృష్టిస్తున్నారంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఆరాధ్య ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రసారం చేశారంటూ యూట్యూబ్‌ చానళ్ల పై ఆమె ఫిర్యాదు చేసింది.

ఎలాంటి ఆధారాలు లేకుండా తనపై కల్పిత వార్తలు రాసి, వీడియోలు చేసిన వారిపై చర్చలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఇప్పుడు ఈ వార్త బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. అప్పుడప్పుడూ సినిమా ఈవెంట్స్‌లో కనిపించే ఆరాధ్య గురించి ఇటీవల సోషల్‌ మీడియాలో ట్రోల్‌ చేశారు. ‘ఆమె అసలు స్కూల్‌కు వెళ్లదా? అంటూ కొందరు సోషల్ మీడియాలో కామెంట్లు సైతం చేశారు.

దీనిపై అభిషేక్‌ బచ్చన్‌ ఓ వేదికపై మాట్లాడారు. ‘తమ కుటుంబానికి సినీ నేపథ్యం ఉండొచ్చు. కానీ, తన కూతురు ఆరాధ్యకు ఇండస్ట్రీతో సంబంధం లేదు. ఆమె చదువుకుంటుంది. పిల్లలు, సెలబ్రిటీల పిల్లలపై ఇలాంటి ట్రోలింగ్‌లను అసలు సహించకూడదు. అసత్య ప్రచారాలు చేసేవారిని క్షమించాల్సిన అవసరం లేదు. అయినా తనపై ఇలాంటి వార్తలను ప్రచారం చేస్తున్నారు. మీడియా నాతో ఏమైనా చెప్పాలనుకుంటే ప్రత్యక్షంగా మాట్లాడండి. ఇలా వ్యక్తిగత విషయాల్లోకి రావొద్దంటూ హెచ్చరించారు’ అని హెచ్చరించారు.

A lso Read..

Virupaksha : ‘విరుపాక్ష’ షో వేయలేదని థియేటర్‌ను ధ్వంసం చేసిన ఫ్యాన్స్

Advertisement

Next Story

Most Viewed