జనసేన అధినేత పవన్ కు అభిమాని అరుదైన గిఫ్ట్..

by Shiva |   ( Updated:2023-06-28 13:50:16.0  )
జనసేన అధినేత పవన్ కు అభిమాని అరుదైన గిఫ్ట్..
X

దిశ, వెబ్ డెస్క్ : ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల నేతలు రోడ్డు షోలతో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే వారి అభిమాన నాయకుల మెప్పు పొందేందుకు వివిధ రకాలుగా తమ ప్రేమను ప్రదర్శిస్తుంటారు. ఇదే క్రమంలో తాజాగా కోనసీమ జిల్లాలో వారాహి యాత్ర జరిపిన పవన్ కళ్యాణ్ కు బహుమతిగా ఓ అభిమాని ఏకంగా మినీ వారాహి వాహనాన్ని తయారు చేశాడు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో జనసేన ఎంపీటీసీ జక్కంపూడి విజయలక్ష్మి శ్రీనివాస్ కుమారుడు వినూత్నంగా ఆలోచించాడు. తనకు పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానాన్ని ప్రదర్శించేందుకు ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. అదే సమయంలో పవన్ వారాహి యాత్ర ప్రారంభించారు. దీంతో పవన్ కు వారాహి పోలికలతో ఓ చిన్న వాహనం తయారు చేసి ఇస్తే ఎలా ఉంటుందని ఆలోచించాడు.

ఆంధ్రప్రదేశ్ రోడ్లపై తిరుగుతున్న వారాహిని చూసి మినీ వారహిని తయారు చేశాడు. ఆ బుడతడు మినీ వారాహిని తయారు చేసేందుకు కేవలం పది రోజులు సమయం మాత్రమే తీసుకోవడం విశేషం. కేవలం పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతోనే ఆయనకు బహుమతిగా ఇవ్వడం మినీ వారాహిని తయారు చేశానని బాలుడు తెలిపాడు. ఇప్పటికే కోనసీమ జిల్లాలో యాత్ర ముగించుకుని నరసాపురం చేరుకున్న పవన్ కు త్వరలోనే మిని వారాహిని బహూకరించే అవకాశం ఉంది.

Advertisement

Next Story