ఇచ్చంత్రం.. ప్రపంచంలో ఇదే ఫస్టనుకుంటా!

by Shyam |   ( Updated:2020-08-17 01:16:57.0  )
ఇచ్చంత్రం.. ప్రపంచంలో ఇదే ఫస్టనుకుంటా!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో రెండు జంటలకు సంబంధించి జోరుగు చర్చ జరుగుతోంది. అంతేకాదు.. వాళ్లకు పుట్టబోయే బిడ్డల కోసం అంతేస్థాయిలో చర్చ జరుగుతోంది. విషయమేమిటంటే.. భలే బాగుందంటూ ఓ చిరునవ్వు నవ్వుకుంటూ లైక్ కొట్టేస్తున్నారు. ఇలా నేనెప్పుడూ నిజంగా చూడలేదు. సినిమాల్లో చూశాం.. కానీ, నిజ జీవితంలో చూడలేదంటూ మరికొందరూ కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికైతే మీరు సూపర్ అంటూ ఇంకొందరు పోస్టులు పెడుతున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దామా.. అయితే ఈ స్టోరీ మీరు చదవాల్సిందే.

అమెరికాకు చెందిన బ్రియానా డీన్, బ్రిట్టనీ అనే వీరిద్దరూ అక్కాచెల్లెళ్లు. అంతేకాదు వీరిద్దరు కవలలు. మరొక విషయమేమిటంటే.. వీరిద్దరూ ఒకే రోజు 2018 ఆగస్టులో పెళ్లి చేసుకున్నారు. అది కూడా కవలలనే చేసుకున్నారు. వారి పేర్లు జెరెమీ సాల్కర్స్, జోష్. ఇంకో విషయమేమిటంటే.. ఈ అక్కాచెల్లెళ్లు ప్రస్తుతం ప్రెగ్నెంట్స్. సో.. వీళ్ల ఆనందం అంతా ఇంతా కాదు. ఇప్పుడీ జంటలో తన ఫ్యామిలీల్లోకి రాబోతున్న పిల్లల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ విషయాన్ని వారే స్వయంగా ట్విట్టర్ లో పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ జంటలను ట్విట్టర్ లో సుమారు 50 వేల మందికి ఫాలోయర్లు ఉన్నారంట. మొత్తానికి ఈ రెండు జంటలు సెలబ్రిటీలు అయ్యాయి.

Advertisement

Next Story

Most Viewed