త్రిష మ్యారేజ్ అయిందా?

by Shyam |   ( Updated:2020-07-17 21:30:53.0  )
త్రిష మ్యారేజ్ అయిందా?
X

ఎవర్ గ్రీన్ హీరోయిన్ త్రిష అందం పెరుగుతుందే తప్ప తరగడం లేదు. రీసెంట్‌గా 96 సినిమాతో మ్యాజిక్ చేసిన త్రిష.. 37 ఏండ్లు వచ్చినా సరే పెండ్లి ఎప్పుడన్న ది మాత్రం చెప్పటం లేదు. వరుణ్ అనే బిజినెస్ మెన్‌తో ఎంగేజ్ మెంట్ చేసుకుని కూడా మ్యారేజ్ బ్రేక్ చేసుకుంది. అందుకు కారణం ఏంటో ఇంకా చెప్పనే లేదు. ఆ తర్వాత పెండ్లి గురించి అడిగినా అసలు రెస్పాన్స్ ఇవ్వలేదు.

ఇదిలా ఉంటే త్రిష పెండ్లి గురించి లేటెస్ట్ న్యూస్ ఒకటి కోలీవుడ్‌లో హల్ చల్ చేస్తుంది. అలై, విన్నయి తాండి వరువాయా లాంటి సినిమాల్లో కలిసి నటించిన శింబుతో త్రిష పెండ్లి అయినట్లు న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. అయితే నయన్, హన్సికతో ప్రేమాయణం నడిపిన శింబు వారిద్దరికీ బ్రేక్ అప్ చెప్పేశాడు. మరి ఇప్పుడు త్రిషను పెండ్లి చేసుకోవడం ఏంటి?. తమిళ మీడియా ప్రచారం చేస్తుంది కరెక్టేనా?. ఇది ఎంత వరకు నిజం అనేది త్రిష, శింబులు స్పందిస్తే కానీ తెలియదు.

Advertisement

Next Story