అదొక్కటే మా ఏకైక లక్ష్యం: హరీష్ రావు

by Shyam |   ( Updated:2020-08-02 05:10:44.0  )
అదొక్కటే మా ఏకైక లక్ష్యం: హరీష్ రావు
X

దిశ, సంగారెడ్డి: సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంతో మాత్రమే అభివృద్ధి సాధ్యమని మంత్రి హరీశ్ రావు అన్నారు. సంగారెడ్డి నియోజక వర్గం కొండాపూర్ మండల జెడ్పీటీసీ పద్మావతి పాండురంగం, మండలంలోని ఆరుగురు సర్పంచ్ లు మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో సంగారెడ్డి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామన్నారు. ప్రస్తుతం అయితే ఎలాంటి ఎన్నికలు లేవు, ఓట్లు లేవు, రాజకీయాలు లేవు అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యమన్నారు. పాత, కొత్త అనే తేడాలు లేకుండా అందరిని కలుపుకొని పోతామన్నారు.

Advertisement

Next Story