- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బోర్డు తిప్పేసిన ఫైనాన్స్ సంస్థ
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా కేంద్రంగా రెండు బ్రాంచ్ లతో ఏర్పాటైన గ్రావిటి పైనాన్స్ సంస్ధ బోర్డు తిప్పేసింది. అందులో పని చేసిన నిరుద్యోగులకు వేతనాలు ఇవ్వకుండా, రుణాలు ఇస్తామని కస్టమర్ల దగ్గర వసూలు చేసిన సోమ్ముతో బిచాణా ఎత్తేసింది.
నిజామబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ ఏరియాలో. కొంతకాలం క్రితం గ్రావిటీ ఫైనాన్స్ అనే సంస్థను ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా కు చెందిన గుడిపాటి పవన్ కళ్యాణ్ (ఎండి)గా , ఇదే జిల్లాకు చెందిన మనీషా డైరెక్టర్ గా, మేనేజర్ సురేష్ , హెచ్ఆర్ రమేష్ గ్రావిటి పైనాన్స్ ను ఏర్పాటు చేశారు. ఇందులో ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగుల దగ్గర రూ.ఐదు వేల నుంచి పది వేలు వసూలు చేసి 15 నుంచి 20 మంది నిరుద్యోగులు ఎంపిక చేశారు. వారికి టార్గెట్లు విధించి లోన్లు మంజూరు చేయించడం, కస్టమర్ల దగ్గర డబ్బులు వసూలు చేయించారు.
వ్యాపారానికి, బిజినెస్ లకు సంబంధించిన అన్ని రకాల లోన్లు ఇస్తామని రంగు రంగుల కాగితాలు ముద్రించి కస్టమర్లను ఆకట్టుకున్నారు. వారికి బ్యాంకు చెక్కులు ఇచ్చి లోన్ మంజూరు 45 రోజుల ముందు డబ్బులు కడితేనే మీకు లోన్ మంజూరు అవుతుందని ఏడు వేల రూపాయల నుంచి లక్ష రూపాయలు వరకు కట్టించుకున్నారు. సుమారు 40 నుంచి 60 మంది కస్టమర్ల దగ్గర ఆ గ్రావిటీ ఫైనాన్స్ సంస్థ పేరుతో రశీదులు ఇచ్చి మూడు, నాలుగు నెలలుగా రూ.40 నుంచి 50 లక్షలు వసూలు చేశారు.
వినాయక్ నగర్ లో ఉన్న సంస్థ కార్యాలయం హెచ్డిఎఫ్సి బ్యాంకు పై నాకు మారింది. కస్టమర్లకు అందుబాటులో ఉంచేందుకు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేయాలని భావించామని, అందుకే ఆలస్యం జరిగిందని కస్టమర్లతో మీటింగ్ ఏర్పాటు చేసి నమ్మబలికారు. గ్రావిటీ ఫైనాన్స్ సంస్థ దీంతో కస్టమర్లు అందరకీ చెక్కులు ఇచ్చారు. కస్టమర్లు లోన్ తేదీ 45 రోజుల తర్వాత డబ్బుల కోసం బ్యాంకులకు వెళ్లగా అక్కడ నుంచి కొన్ని చెక్కులు బౌన్స్ రావడం మొదలయ్యాయి. దీంతో కస్టమర్లను, నిరుద్యోగులను గ్రావిటీ ఫైనాన్స్ సంస్థ నిండా ముంచి బోర్డు తిప్పేసిందని అర్థమైంది.
కాగా గ్రావిటీ ఫైనాన్స్ సంస్థపై గతంలోనే వరంగల్ జిల్లాలోని హన్మకొండలో కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. అక్కడ నుంచి పరారీ అయిన గుడిపాటి పవన్ కళ్యాణ్ నిజామాబాద్ లో బ్రాంచ్ ఏర్పాటు చేసి బోర్డు తిప్పేశారు. నిజామబాద్ జిల్లాలో పనిచేసిన ఉద్యోగులు, కష్టమర్లు నగరంలోని నాలుగు టౌన్ లో ఫిర్యాదు చేయగా ఎప్ఐఆర్ నమోదు అయింది.