తాజాగా 237 పాజిటివ్ కేసులు

by vinod kumar |
తాజాగా 237 పాజిటివ్ కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రంలో కరోనా కేసులు ఐదు వేల మార్కుకు చేరువలో ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ ఆదివారం విడుదల చేసిన హెల్త్ బులిటెన్ ప్రకారం.. కొత్తగా 237 మందికి పాజిటివ్ నిర్ధారణ కాగా.. ముగ్గురు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 4,974 కు చేరుకుంది. ఇందులో 449 మంది విదేశాల నుంచి వచ్చినవారు, వలస ప్రజలు ఉన్నారు. ఇక కొత్తగా మూడు మరణాలతో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు 185 మంది కరోనాతో మృతి చెందారు. 2,377 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా.. 2,412 మంది కరోనా చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదైన 237 కేసుల్లో.. జీహెచ్ఎంసీలో 195, మేడ్చల్‌లో 10, రంగారెడ్డిలో 8, సంగారెడ్డిలో 5, మంచిర్యాలలో మూడు, వరంగల్ అర్బన్, కామారెడ్డి, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో రెండు చొప్పున నమోదయ్యాయి.

Advertisement

Next Story