ట్రేడ్ లైసెన్స్‌ల‌కు మార్చి 31 గడువు

by Shyam |   ( Updated:2020-03-19 06:58:41.0  )

దిశ, న్యూస్ బ్యూరో:ట్రేడ‌ర్లు మార్చి 31వ తేదీలోపు త‌మ లైసెన్స్‌ల‌ను రెన్యువ‌ల్ చేసుకోవాల‌ని జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ డీఎస్‌ లోకేష్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవ‌ల జ‌రిగిన జీహెచ్‌ఎంసీ స‌ర్వ‌స‌భ్య స‌మావేశంలో చేసిన తీర్మానం మేర‌కు ట్రేడ్ లైసెన్స్ గ‌రిష్ట ఫీజు సీలింగ్‌ను తొల‌గించిన‌ట్లు తెలిపారు. ఈ నెల 31లోపు ప్రొవిజ‌న‌ల్ స‌ర్టిఫికేట్లు, ట్రేడ్ లైసెన్స్ రెన్యువ‌ల్స్ ను చేసుకోవాల‌ని తెలిపారు. లైసెన్సుల రెన్యువ‌ల్‌లో జాప్యం చేస్తే భారీగా పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంద‌ని చెప్పారు. ప్రొవిజిన‌ల్‌ ట్రేడ్ లైసెన్స్ క‌లిగినవారు ఈ-సేవా, సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్ల ద్వారా మార్చి 31లోపు రెన్యువ‌ల్ చేసుకోవాల‌ని తెలిపారు. కొత్త ట్రేడ్ లైసెన్స్‌ల‌కు ఈ-సేవా కేంద్రాలు, జీహెచ్ఎంసీ సిటిజ‌న్ స‌ర్వీస్ సెంట‌ర్లు, జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్‌, జీహెచ్ఎంసీ స‌ర్కిల్ ఆఫీస్‌ల‌లో ద‌ర‌ఖాస్తు చేయాల‌ని వివరించారు. ట్రేడ్ లైసెన్స్ వివ‌రాలకు జీహెచ్ఎంసీ వెబ్‌సైట్ www.ghmc.gov.inను సందర్శించాలని క‌మిష‌న‌ర్ పేర్కొన్నారు.
Tags: last date to renewal of trade lisence, 31 march, ghmc commisioner ds lokesh kumar, if fail large penalties

Advertisement

Next Story

Most Viewed