మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాల గడువు పొడిగింపు..

by Shyam |
మైనారిటీ విద్యార్థుల ఉపకార వేతనాల గడువు పొడిగింపు..
X

దిశ, మెదక్: జిల్లాలో మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థులు ప్రీ మెట్రిక్, పోస్ట్‌‌ మెట్రిక్, మెరిట్ కం మీన్స్ బేస్డ్ ఉపకారవేతనాల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి గడవు తేదీని ప్రభుత్వం ఈ నెల 15 వరకు పొడిగించిందని జిల్లా అల్ప సంఖ్యాక వర్గాల సంక్షేమ అధికారి జగదీశ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 1 నుండి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలకు, ఇంటర్మీడియట్ నుండి పి.హెచ్.డి., ఐ.టి.ఐ., ఐ.టి.సి. వంటి సాంకేతిక కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు, యు.జి., పి.జి. టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న విద్యార్థులు మెరిట్ కం మీన్స్ ఉపకార వేతనాలకు ఈ నెల15లోగా www.scholarships.gov.in వెబ్ సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

అదేవిధంగా అన్ని పాఠశాలల, కళాశాలల వారు ఎన్.ఎస్.పి పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. యూజర్ ఐడి., పాస్‌వర్డ్ ద్వారా వారి ఇన్స్టిట్యూట్ లాగిన్ అయి మొదటగా ప్రొఫైల్, తరగతులు వాటి ఫీజుల వివరాలు నమోదు చేసుకున్న తరువాత మాత్రమే విద్యార్థులను ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు సమర్పించేలా చూడాలని జగదీశ్ సూచించారు. యూజర్ ఐడి , పాస్‌వర్డ్ లేని పాఠశాల, కళాశాల యాజమాన్యాలు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని లేదా 8142741976 అనే మొబైల్ నెంబర్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.

Advertisement

Next Story

Most Viewed