- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఏపీ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు… ఉత్తర్వులు విడుదల
దిశ, ఏపీ బ్యూరో: అమ్మఒడి పథకంలో భాగంగా విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీపై తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ల్యాప్‌టాప్‌లను ప్రముఖ కంపెనీల నుంచి కొనుగోలు చేయనున్నారు. ఇప్పటికే మూడు కంపెనీలను సంప్రదించాలని ప్రభుత్వం యోచిస్తోంది. పెద్దమొత్తంలో ల్యాప్‌టాప్‌లు కొనుగోలు చేస్తున్నందు వల్ల ఆయా కంపెనీలు తక్కువ ధరకే అందించే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు గురువారం పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్ ఉత్తర్వులిచ్చారు.
డ్యూయల్ కోర్ ప్రాసెసర్, 4 జీబీ ర్యామ్, 500 జీబీ హార్డ్ డిస్క్, 14 అంగుళాల స్క్రీన్, విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్, ఎక్సెల్, వర్డ్, పవర్ పాయింట్‌తో కూడిన ఓపెన్ ఆఫీస్ ల్యాప్‌టాప్‌లను తీసుకోనున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లకు మూడేళ్ల వారంటీ ఉండనుంది. అమ్మఒడి పథకంలో ఆర్థికసాయానికి బదులుగా ల్యాప్‌టాప్‌లు కోరుకునే విద్యార్థులకు వీటిని పంపిణీ చేయనున్నారు. ల్యాప్ టాప్ లు ఒకవేళ మరమ్మతులకు గురైతే వారం రోజుల్లో చేసి ఇచ్చేలా ల్యాప్‌టాప్ కంపెనీకి షరతు విధించారు. ఇందులో భాగంగా టెండర్లను ఏపీటీఎస్‌కు అప్పగించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.