- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నా చెప్పులు తీసుకురండి.. అప్పుడు చెప్తా : కంగన
దిశ, సినిమా : ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌కు సోషల్ మీడియా వార్ కొత్తేం కాదు. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో వార్తల్లో నిలిచే భామ.. తాజాగా బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాసేపై నోరు పారేసుకుంది. అసలు విషయానికొస్తే.. నటి యామీ గౌతమ్, డైరెక్టర్ ఆదిత్య ధర్‌ను పెళ్లి చేసుకుని సర్‌ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. యామీ హోమ్ టౌన్ హిమాచల్ ప్రదేశ్‌లో వివాహం జరగగా, ఈ జంట ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. ఇక మ్యారేజ్ వేడుకల్లో భాగంగా యామీ రెడ్ కలర్ చీర, ముక్కుకు పెద్ద ఉంగరంతో ఉన్న ట్రెడిషన్ లుక్ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంది.
కాగా బ్రైడల్ లుక్‌లో నిజంగా దేవతలానే కనిపిస్తోంది అంటూ కంగన యామీపై ప్రశంసలు కురిపించగా.. నటుడు విక్రాంత్ మాసే ‘గాడ్ ఉమన్ ‘రాధే మా’ వలె స్వచ్ఛమైన భక్తురాలు’ అంటూ కామెంట్ చేశాడు. దీనిపట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన కంగన.. ‘ఈ బొద్దింక ఎక్కడ నుంచి వచ్చింది, నా చెప్పులు తీసుకురండి దీని సంగతి చెప్తా’ అని రిప్లయ్ ఇచ్చింది. అయితే ‘రాధే మా’కు కంగనా మద్దతుదారా? అన్న విషయం తెలియదు కానీ.. హిందూ మతంపై విమర్శలు చేసేవారిపై తరచూ ఎదురుదాడి చేయడంతో పాటు మత పెద్దలకు మద్దతునిస్తుందన్న సంగతి తెలిసిందే.